Begin typing your search above and press return to search.

ఆ ప‌ని చేసినందుకు అమ్మ అట్ల‌కాడ తిరగేసి కొట్టేది: శ్రీలీల‌

రాబిన్‌హుడ్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హీరోయిన్ శ్రీలీల త‌న‌లోని దొంగ గురించి బ‌య‌ట‌పెట్టింది.

By:  Tupaki Desk   |   12 March 2025 12:05 PM IST
ఆ ప‌ని చేసినందుకు అమ్మ అట్ల‌కాడ తిరగేసి కొట్టేది: శ్రీలీల‌
X

రాబిన్‌హుడ్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హీరోయిన్ శ్రీలీల త‌న‌లోని దొంగ గురించి బ‌య‌ట‌పెట్టింది. మైత్రీ బ్యాన‌ర్‌లో నితిన్‌, శ్రీలీల జంట‌గా న‌టించిన రాబిన్‌హుడ్ మూవీ మార్చి 28వ తేదీన విడుద‌ల‌వనుంద‌ని తెలిసిందే. మంగ‌ళ‌వారం ఈ సినిమా యూనిట్ నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో శ్రీలీల మాట్లాడుతూ చిన్న‌త‌నంలో అమ్మ ప‌ర్స్‌లో నుంచి లిప్‌స్టికులు, ఆమె మేక‌ప్ వ‌స్తువుల‌ను దొంగ‌లించేదాణ్ణి అని చెప్పింది. అవి క‌నిపించ‌డం లేద‌ని తెలిశాక అమ్మ అట్ల‌కాడ తిర‌గేసి కొట్టేద‌ని శ్రీలీల చెప్ప‌డంతో స్టేజ్‌పై ఉన్న చిత్ర బృందమంతా కొద్దిసేపు న‌వ్వు ఆపుకోలేక‌పోయారు.

రాబిన్‌హుడ్ గురించి చెబుతూ హీరో నితిన్ త‌న‌ను బాగా ప్రోత్స‌హించార‌ని చెప్పింది. కొన్ని స‌న్నివేశాల్లో ఈ డైలాగ్‌లు శ్రీలీల‌కు ప‌డితే బాగుంటుంద‌ని ప‌ట్టుప‌ట్టి త‌న‌తో చెప్పించార‌ని తెలిపింది. నితిన్‌లో చాలా గొప్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని అత‌డిని ఆకాశానికెత్తింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌తో త‌న ట్రాక్‌లు మంచి న‌వ్వుల్ని పూయిస్తాయ‌ని చెప్పింది. ఈ సినిమాకు ఎంతో నిజాయితీగా ప‌నిచేశామ‌ని, రాబిన్‌హుడ్ ప్ర‌తీ ఒక్క‌రినీ అల‌రిస్తుంద‌ని శ్రీలీల చెప్పింది.

ఇదే ఈవెంట్ లో రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా త‌న‌లోని దొంగ గురించి బ‌య‌ప‌ట్టారు. వాళ్ల నాన్న మిల‌ట‌రీ ఆఫీస‌ర్ కావ‌డంతో ఇంట్లో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చేవారని, మొత్తం ఏడుగురు సంతానంలో తానే ఎక్కువ చిలిపి ప‌నులు చేసి బాగా దెబ్బ‌లు తినేవాడిన‌ని, ఒక‌సారి వాళ్ల నాన్న ప‌ర్స్‌లో రూ.5 పైస‌లు దొంగ‌లించి శెన‌గ ఉండ‌లు కొనుక్కొని తిని దెబ్బ‌లు తిన్నాడ‌ని చెప్పారు.

మ‌రోసారి ప‌క్కింట్లోని జామ చెట్టుకు కాయ‌లు బాగా కాయ‌డంతో అవి కొయ్య‌డానికి వెళ్లి కింద‌కి దిగేట‌ప్పుడు ఆ ఇంటి య‌జ‌మాని చూసి, వాళ్ల నాన్న‌కు నాన్న‌కి రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టించింద‌ని, కింద‌కు దిగాక త‌న తండ్రి పొయ్యిలో పెట్టే బెర‌డ్లు విరిగే దాక వీపు ప‌గ‌ల‌గొట్టాడ‌ని, అయితే, బాల‌కృష్ణుడిలా ఇన్ని చిలిపి దొంగ‌త‌నాలు చేసినా తాను జీవితంలో పైకి వ‌చ్చాన‌ని రాజేంద్ర ప్ర‌సాద్ న‌వ్వుతూ చెప్పారు.