అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన శ్రీలీల
ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తోన్న అందాల భామ శ్రీలీల.
By: Tupaki Desk | 16 Nov 2024 5:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తోన్న అందాల భామ శ్రీలీల. ఈ అమ్మడుకి కెరియర్ లో ఇప్పటి వరకు ధమాకా రూపంలో ఒక్క సక్సెస్ మాత్రమే లభించింది. దీని తర్వాత ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ సక్సెస్ అయ్యి ఉంటే ఆమె ఫేట్ మారిపోయేది. అయితే సినిమాలో ఆమె డాన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది కానీ మూవీ స్ట్రాంగ్ గా పబ్లిక్ కి రీచ్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు.
ఇదిలా ఉంటే నితిన్ కి జోడీగా ఆమె నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. అంతకంటే ముందు డిసెంబర్ 5న రిలీజ్ కాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’లో ఐటెం క్వీన్ గా ఆమె కనిపించబోతోంది. రీసెంట్ ఈ మూవీ ఐటెం సాంగ్ ని శ్రీలీల పూర్తి చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డాన్సర్స్ లలో ఒకడైన అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల ఈ సాంగ్ కోసం అదిరిపోయే స్టెప్పులు వేయడంతో అందరికి ఆసక్తి క్రియేట్ అయ్యింది.
ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్స్ కలిసి స్టేజ్ మీద ఏ రేంజ్ లో డాన్స్ మూమెంట్స్ చేశారో చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత శ్రీలీల అల్లు అర్జున్ తో పాటు అతని భార్య స్నేహారెడ్డి, వారి పిల్లలకి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చింది. కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలని రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో వాటిని షేర్ చేసి శ్రీలీలకి థాంక్స్ చెప్పాడు.
ఆమెని డ్యాన్సింగ్ క్వీన్ గా అభివర్ణిస్తూ అల్లు అర్జున్ స్టేటస్ పెట్టడం విశేషం. నువ్వు పంపించిన గిఫ్ట్స్ ఇప్పుడే చూసాను. అందులో నువ్వు రాసిన లెటర్ లో నా మనసుని తాకింది. నీ ప్రేమకి నా కృతజ్ఞతలు అంటూ బన్నీ మెన్షన్ చేసాడు. అలాగే ఆమె రాసిన లెటర్స షేర్ చేశాడు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా శ్రీలీల పంపించిన లెటర్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
అందులో స్నేహా రెడ్డి ఆతిధ్యానికి శ్రీలీల థాంక్స్ చెప్పింది. తనని అద్భుతంగా ఆదరించిన ఫ్యామిలీ మొత్తానికి శ్రీలీల లెటర్ థాంక్స్ చెప్పింది. ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని మరో లెటర్ కూడా అల్లు అర్జున్ కి పంపించింది. ఈ లెటర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.