Begin typing your search above and press return to search.

శ్రీ‌లీల ప్రేమ‌లో ప‌డి పిచ్చోడైపోయిన యంగ్ హీరో

ప్ర‌స్తుతం ఆషిఖి 3 చిత్రీక‌ర‌ణ‌లో ఈ జంట బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా సిలిగురిలో సెట్స్ నుండి లీక్ అయిన ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   28 March 2025 3:57 AM
Kartik Aaryan Deep Love With Sree Leela
X

గ‌త కొంత‌కాలంగా తెలుగు హీరోయిన్ శ్రీ‌లీల ముంబై స‌ర్కిల్స్ లో జోరుగా షికార్ చేస్తుండ‌డం చ‌ర్చ‌గా మారింది. టాలీవుడ్ లో న‌టిస్తూనే, బాలీవుడ్ లో పెద్ద కెరీర్ ని ప్లాన్ చేస్తోంది ఈ ప్ర‌తిభావ‌ని. అదే స‌మ‌యంలో బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ తో నిండా ప్రేమ‌లో మునిగింద‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. స‌హ‌జంగానే బాలీవుడ్ మీడియా ఇలాంటి గాసిప్పుల‌ను సృష్టించ‌డంలో ఎప్పుడూ ముందుంటుంది. అస‌లు కార్తీక్ తో శ్రీ‌లీల డేట్ నిజ‌మేనా? అనేదానికి ఇంకా ఎలాంటి స్ప‌ష్ఠ‌తా లేదు.

ప్ర‌స్తుతం ఆషిఖి 3 చిత్రీక‌ర‌ణ‌లో ఈ జంట బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా సిలిగురిలో సెట్స్ నుండి లీక్ అయిన ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. శ్రీలీల బ్యాక్ సీట్ లో కూచుని ఉండ‌గా, కార్తీక్ ఆర్యన్ బైక్ నడుపుతున్నాడు. అత‌డి చేతికి గాయమైంది. ఆ గాయానికి క‌ట్టు క‌ట్టి క‌నిపిస్తోంది. లీక్ అయిన ఫోటోలు చూశాక అభిమానులు శ్రీ‌లీల ప్రేమ‌లో ప‌డి పిచ్చోడైపోయిన న‌టుడు! అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీ‌లీల‌ ప్రియుడి చేతికి గాయాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ లుక్స్ కేవ‌లం సినిమా కోసం ప్రీఫిక్స్ చేసిన‌వి మాత్ర‌మే.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రానికి అనురాగ్ బసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా లీకైన ఫోటోల‌ను చూశాక మ‌రోసారి ఆషిఖి 2తో అభిమానులు పోల్చి చూస్తున్నారు. పార్ట్ 2లో శ్ర‌ద్ధా క‌పూర్- ఆదిత్య రాయ్ క‌పూర్ జంట‌గా న‌టించ‌గా, ఇప్పుడు శ్రీ‌లీల‌- కార్తీక్ ఆర్య‌న్ జంట‌గా న‌టిస్తున్నార‌ని భావిస్తున్నారు. ఈ సినిమాతోనే ద‌క్షిణాది సంచలనం శ్రీలీల బాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తోంది. సిలిగురి షూటింగ్ లో ఈ బ్యూటీ స‌ర‌స‌న‌ కార్తీక్ ఆర్య‌న్ బాగా పెరిగిన జుట్టు గుబురు గడ్డంతో ర‌గ్గ్ డ్ గా క‌నిపిస్తున్నాడు. అత‌డి లుక్ నిజంగా స‌ర్ ప్రైజింగ్ గా ఉండ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. చేతికి గాయం స‌న్నివేశంలో భాగ‌మేన‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇది ప్రేమక‌థా చిత్రం. ప్రియురాలి కోసం ప్రియుడి సాహ‌సాన్ని చూడొచ్చు.

ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం ఒక రొమాంటిక్ మ్యూజికల్ మూవీ. ఫస్ట్ లుక్‌ను ఫిబ్రవరి 15న మేకర్స్ విడుదల చేశారు. ఫ‌స్ట్ లుక్ లో కార్తీక్ హృదయాన్ని క‌దిలించే గాయకుడిగా కనిపించగా, శ్రీలీల అతడి ప్రేయసిగా నటించింది. అయితే ఈ సినిమా ఆషికి ఫ్రాంచైజీకి సంబంధించినదా కాదా? అన్న‌ది మేకర్స్ స్పష్టం చేయాల్సి ఉంది. గతంలో, త్రిప్తి దిమ్రి ఈ సినిమాలో కార్తీక్ సరసన నటించాల్సి ఉన్నా.. ఆ స్థానంలో శ్రీలీలను మేక‌ర్స్ ఎంపిక చేసుకున్నారు.