Begin typing your search above and press return to search.

'మంగ‌ళ‌వారం' సీక్వెల్ లో మ‌త్తెక్కించే బ్యూటీ!

ఈ నేప‌థ్యంలో మెయిన్ లీడ్ కోసం ఫీమేల్ వేట కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ క్రేజీ బ్యూటీ పేరు తెర‌పైకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   9 Feb 2025 7:52 AM GMT
మంగ‌ళ‌వారం సీక్వెల్ లో మ‌త్తెక్కించే బ్యూటీ!
X

ఇటీవ‌లే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ 'మంగ‌ళ‌వారం' చిత్రానికి అజ‌య్ భూప‌తి సీక్వెల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పాయ‌ల్ రాజ్ పుత్ మెయిన్ లీడో పోషించిన 'మంగ‌ళ‌వారం' మంచి విజ‌యం సాధించ‌డంతోనే అజ‌య్ సీక్వెల్ ఛాన్స్ తీసుకున్నాడు. అయితే ఈ సీక్వెల్ లో మాత్రం పాయ‌ల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ కాద‌ని..మ‌రో కొత్త భామ‌ని ప‌రిశీలిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వెలుగులోకి వ‌చ్చింది. క‌థ ఎక్క‌డ ముగించారో మ‌ళ్లీ అక్క‌డ నుంచే రెండ‌వ భాగం క‌థ కొన‌సాగుతుంది కాబ‌ట్టి ఆపాత్ర‌లో పాయ‌ల్ ఉంటుంద‌ని అంతా భావించారు.

కానీ అజ‌య్ భూప‌తి హీరోయిన్ విష‌యంలో ఆ ఛాన్స్ తీసుకోలేదు. కొత్త‌భామ అయితే ప్రెష్ ఫీల్ ఉంటుంద‌ని పాయ‌ల్ పాత్ర‌ని రీప్లేస్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మెయిన్ లీడ్ కోసం ఫీమేల్ వేట కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ క్రేజీ బ్యూటీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆమె శ్రీలీల‌. అజ‌య్ భూప‌తి రాసిన స్టోరీకి శ్రీలీల ప‌ర్పెక్ట్ గా సెట్ అవు తుందట‌. ఆ పాత్ర‌కు వంద శాతం న్యాయం చేయ‌గ‌ల న‌టి శ్రీలీల అవుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నాడట‌.

శ్రీలీల‌కు ఇలాంటి హాట్ స్టోరీలు ప‌డితే చెల‌రేగిపోతుంది. హాట్ కంటెంట్ కి హాట్ బ్యూటీ తోడైతే సినిమా లెవ‌ల్ కూడా పెరుగుతుంది. టాలీవుడ్ లో శ్రీలీల క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోయిన్ గా త‌న‌కంటూ ప్ర‌త్యే క‌మైన గుర్తింపును ద‌క్కించుకుంది. ఐటం పాట‌ల‌తోనూ ఫేమ‌స్ అయింది. యువ‌త‌లో మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకునే 'మంగ‌ళ‌వారం' సీక్వెల్ కి ఈ భామ‌ని ప‌రిశీలిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

మ‌రి శ్రీలీల ఎంట్రీ విష‌యంలో వాస్త‌వం ఎంత అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం శ్రీలీల హీరోయిన్ గా నాలుగు సినిమా లు చేస్తోంది. 'రాబిన్ హుడ్' లో నితిన్ స‌ర‌స‌స‌న న‌టిస్తోంది. అలాగే 'మాస్ జాత‌ర‌'లో రెండ‌వ సారి ర‌వితేజ తెర‌ను పంచుకుంటోంది. ప‌వన్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' లోనూ న‌టిస్తోంది.