Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ ఓ చాట్ జీపీటీ!

బ‌న్నీతో అమ్మ‌డు పోట పోటీగా డాన్సులు చేసి అల‌రించింది. తాజాగా ఆ డాన్స్ అనుభ‌వంపై అమ్మ‌డు తొలిసారి ఓపెన్ అయింది.

By:  Tupaki Desk   |   9 Dec 2024 5:28 AM GMT
ఐకాన్ స్టార్ ఓ చాట్ జీపీటీ!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌-2` బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. రికార్డు వ‌సూళ్ల‌తో సినిమా దూసుకుపోతుంది. ఇప్ప‌ట్లో పుష్ప వేగాన్ని ఆప‌డం అసాధ్య‌మైన ప‌ని. సినిమా ఇంత గొప్ప విజ‌యం సాధిచిందంటే? అన్ని స‌మ‌పాళ్ల‌లో కుద‌ర‌డంతోనే. బ‌న్నీతో పాటు ర‌ష్మిక మంద‌న్నా, ఇత‌ర పాత్ర‌ధారులంతా తమ పాత్ర‌ల‌కు అన్ని ర‌కాలుగా న్యాయం చేయ‌డంతోనే సాధ్య‌మైంది. ఇందులో ఐటం పాట‌లో శ్రీలీల ఓ ఊపు ఊపేసిన సంగ‌తి తెలిసిందే.

బ‌న్నీతో అమ్మ‌డు పోట పోటీగా డాన్సులు చేసి అల‌రించింది. తాజాగా ఆ డాన్స్ అనుభ‌వంపై అమ్మ‌డు తొలిసారి ఓపెన్ అయింది. `మొద‌టిసారి బ‌న్నీని `ఆహా` యాడ్ షూట్ లో క‌లిసాను. ఆ త‌ర్వాత `పుష్ప‌-2` లో కిసుక్కు పాట‌లో న‌టించా. బ‌న్నీ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే అత‌నో డాన్స్ కింగ్. త‌న సినిమాల్లో న‌ట‌న ఒక ఎత్తైతే డాన్సు మ‌రో ఎత్తు. బ‌న్నీతో ఐటం సాంగ్ అనగానే చాలా భ‌యం వేసింది. షూటింగ్ కి ముందు ఎంత‌గానో డాన్సు ప్రాక్టీస్ చేసి సెట్స్ కి వెళ్లాను.

ఆయ‌న‌తో మాట్లాడాక కాస్త భ‌యం త‌గ్గింది. న‌న్ను అర్దం చేసుకున్న అర్జున్ ఇక్క‌డ నేను అల్లు అర్జున్ డాన్స్ చేయ‌డం లేదు. పుష్ప‌రాజ్ లా చేస్తున్నా. కాబ‌ట్టి మీరు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదని నాలో కంగారు పోగొట్టారు. ఐదు రోజుల పాటు ఆ పాట షూట్ చేసాం. ఎంతో ఆత్మీయంగా మెలిగారు. బ‌న్నీ సెట్ లో ఉంటే పాజిటివ్ వైబ్ వ‌స్తుంది. అంద‌ర్నీ ఉత్సాహ ప‌రుస్తారు. తానెంత పెద్ద స్టార్ అయినా అంద‌రితో క‌లిసి పోతారు. చాలా స‌ర‌దాగా ఉంటారు.

అస‌లు త‌ను స్టార్ అనే విష‌యాన్నే మ‌ర్చిపోతారు. కాసేపు మాట్లాడితే చాలు తానొక చాట్ జీపీటీ అని అర్ద‌మై పోతుంది` అన్నారు. `పుష్ప` మొద‌టి భాగంగా ఐటం పాట‌లో స‌మంత న‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ` పాట‌తో ప్ర‌పంచాన్నే ఊపేసింది. రెండ‌వ భాగంలో ఆ ఛాన్స్ శ్రీలీల‌ను వ‌రించింది.