బ్రదర్స్ ఇద్దరితోనూ ఒకేసారి శ్రీలీల సినిమాలు..!
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన మంచి పేరు మాత్రం దక్కించుకుంది. అందుకే ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.
By: Tupaki Desk | 14 Dec 2024 9:30 AM GMTరాఘవేంద్రరావు కొత్త పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా తెలుగు ప్రేక్షకులకు శ్రీలీల నచ్చింది. అందుకే రవితేజకు జోడీగా ధమాకా సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చాలా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన మంచి పేరు మాత్రం దక్కించుకుంది. అందుకే ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్‌కి జోడీగా నటించిన రాబిన్‌హుడ్ సినిమా విడులకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా ఆ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబిన్‌హుడ్ కాకుండా ఇంకా పలు సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇటీవలే నాగ చైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌లో శ్రీలీల జాయిన్ కాబోతుంది అంటూ ఆమె సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇటీవల నాగ చైతన్యతో నటించేందుకు ఎంపిక అయిన శ్రీలీల అనూహ్యంగా అఖిల్ అక్కినేనితో కలిసి నటించే అవకాశంను దక్కించుకుంది. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందబోతున్న వీరి కాంబో మూవీలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేయడం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజం అయితే ఒకేసారి ఇద్దరు అక్కినేని బ్రదర్స్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న హీరోయిన్‌గా శ్రీలీల నిలువబోతుంది.
శ్రీలీల ఇటీవల పుష్ప 2 లో కిస్సిక్ అంటూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఐటెం సాంగ్స్‌లో నటించను అంటూనే అల్లు అర్జున్, సుకుమార్‌లపై శ్రీలీల ఆ పాటలో నటించి మెప్పించింది. అల్లు అర్జున్‌తో సమానంగా శ్రీలీల వేసిన డాన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఒక వైపు హీరోయిన్‌గా వరుసగా సినిమాలు వస్తున్న సమయంలో ఐటెం సాంగ్ లో నటించడం అనేది చాలా పెద్ద విషయం. ఆకట్టుకునే అందంతో పాటు మంచి డాన్సర్ కమ్ నటి అయిన శ్రీలీల ముందు ముందు మరింత మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చైతూ, అఖిల్‌ల సినిమాలు వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.