Begin typing your search above and press return to search.

చిట్టి 'డ్రామా నక్కో' పై శ్రీలీల కామెంట్స్‌

డ్రామా నక్కో మామ పాటను చూసి ఫిదా అయిన శ్రీలీల, తన సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ద్వారా స్పందించింది.

By:  Tupaki Desk   |   22 Sep 2024 6:00 AM GMT
చిట్టి డ్రామా నక్కో పై శ్రీలీల కామెంట్స్‌
X

శ్రీ సింహా, సత్య కీలక, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించిన 'మత్తు వదలరా 2' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడులైన నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ వసూళ్లు సాధించి లాభాల బాటలో సాగుతోంది. దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు మత్తు వదలరా 2 సినిమా వసూళ్ల జోరు కంటిన్యూ అవ్వడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మత్తు వదలరా 2 సినిమా ప్రమోషన్‌ లో భాగంగా డ్రామా నక్కో మామ అంటూ ఒక పాటను విడుదల చేయడం జరిగింది. ఆ పాటను స్వయంగా ఫరియా అబ్దుల్లా రూపొందించడం విశేషం.

డ్రామా నక్కో మామ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించడంతో పాటు సాహిత్యం అందించి పాటకు దర్శకత్వం వహించిన ఫరియా అబ్దుల్లా ప్రతిభను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌ లో ఆ పాట కీలకంగా మారింది అనే విషయం తెల్సిందే. ఫరియా తన మల్టీ ట్యాలెంట్‌ ప్రతిభను కనబర్చి రూపొందించిన పాట ను పలువురు సెలబ్రిటీలు షేర్ చేయడం జరిగింది. తాజాగా ఈ పాటను హీరోయిన్ శ్రీలీల సైతం షేర్ చేసింది. అదే సమయంలో ఫరియా అబ్దుల్లా ప్రతిభ ను ప్రశంసలతో ముంచెత్తడంతో పాటు, పాట లింక్ ను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

డ్రామా నక్కో మామ పాటను చూసి ఫిదా అయిన శ్రీలీల, తన సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ద్వారా స్పందించింది. ఫరియా ను ఆల్ ఇన్ వన్ అమ్మాయి అంటూ శ్రీలీల ప్రశంసించింది. శ్రీలీల ప్రశంసలకు ఫరియా స్పందిస్తూ లవ్ యూ బేబీ అంటూ కామెంట్‌ చేసింది. మొత్తానికి వీరిద్దరి మధ్య సోషల్‌ మీడియాలో సాగిన ఈ ఆసక్తికర సంభాషణ స్క్రీన్‌ షాట్స్ వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు టాలీవుడ్‌ లో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్నారు. ఇలాంటి హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఒకరి గురించి మరొకరు అభినందించుకోవడం అనేది మంచి పరిణామం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మత్తు వదలరా 2 సినిమాకు సీక్వెల్‌ గా మూడో పార్ట్‌ రాబోతున్నట్లుగా ఇప్పటికే దర్శకుడు రితేష్ రానా ప్రకటించాడు. మత్తు వదలరా 3 సినిమాలో ఫరియా అబ్దుల్లా ఉంటుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆమె ఫ్యాన్స్ మాత్రం తప్పకుండా ఆమె కనిపించబోతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సత్య తర్వాత ఆ స్థాయి కామెడీని పండించింది ఆమె కనుక కచ్చితంగా ఆమెకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరో వైపు శ్రీలీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తోంది. పవన్‌ తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో చేయబోతున్న విషయం తెల్సిందే. నితిన్ తో రాబిన్‌ హుడ్‌ సినిమాలో నటిస్తుండగా, రవితేజ తో ఒక సినిమాలో చేస్తోంది.