ప్రేమ వ్యవహారంపై శ్రీలీల స్పందన
ఈ నేపథ్యంలో ఆమె మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించింది. తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలు అన్నీ పుకార్లే అంటూ కొట్టి పారేసింది.
By: Tupaki Desk | 21 Sep 2024 6:14 AM GMTరాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు మూలాలు ఉన్న ఈ అమ్మడు హీరోయిన్ గా కన్నడంలో మొదట ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగు లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీల ప్రస్తుతం పవన్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇతర భాషల్లోనూ ఈ అమ్మడి సినిమాల షూటింగ్ జరుగుతున్నాయి. తాజాగా ఒక చిట్ చాట్ లో శ్రీలీల ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.
శ్రీలీల ప్రేమలో ఉందని, తన సన్నిహితుడితో రిలేషన్ లో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించింది. తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలు అన్నీ పుకార్లే అంటూ కొట్టి పారేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం చదువు, సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చింది. చదువు మధ్యలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. కనుక ఇప్పుడు చదువు పూర్తి చేయాలని అనుకుంటున్నాను. త్వరలోనే తన చదువు పూర్తి చేయనున్నట్లు ఆమె పేర్కొంది. సినిమాల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా చదువు ను మాత్రం అశ్రద్ధ చేయకుండా చదువుతూనే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
చదువు, నటన పై తప్ప ప్రస్తుతం తనకు మరే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. అసలు నాకు ఖాళీ సమయం అనేది లేదు అంది. గత కొన్నాళ్లుగా నా పర్సనల్ లైఫ్ గురించిన శ్రద్ద పెట్టలేదు. కేవలం సినిమాల్లో నటించడం, చదువుకోవడం వరకే నేను చేస్తున్నాను. తప్పకుండా ముందు ముందు మళ్లీ నా పర్సనల్ లైఫ్ కోసం సమయం కేటాయించుకుంటాను. నా జీవితంలో కొన్ని విషయాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తాను అందులో ప్రేమ, పెళ్లి ఉంటాయి. కానీ ఇప్పుడు వాటికి సమయం లేదు అంటూ శ్రీలీల తన గురించి మీడియాలో వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చింది.
గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీల ఒకానొక సమయంలో అయిదు ఆరు సినిమాల్లో నటించింది. కానీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సినిమాలు చేస్తోంది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించిన గుంటూరు కారం సినిమా నిరాశపరచడంతో ఆమె సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ధమాకా హిట్ నేపథ్యంలో మరోసారి రవితేజ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు శ్రీలీల రెడీ అయింది. ఇటీవలే సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా రవితేజ కు ప్రమాదం జరగడంతో ఆలస్యం అయ్యేలా ఉంది. శ్రీలీల మళ్లీ టాలీవుడ్ లో వరుస విజయాలు సొంతం చేసుకుని బిజీ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.