ఆమె చేతుల్లోనే శ్రీలీల భవిష్యత్తు..?
ఇక నెక్స్ట్ మాస్ మహారాజ్ తో మాస్ జాతర సినిమా చేస్తుంది శ్రీలీల. ఈ సినిమాతో అయినా అమ్మడు సూపర్ హిట్ కొడుతుందేమో చూడాలి.
By: Tupaki Desk | 2 April 2025 2:45 AMకెరీర్ లో వచ్చీ రాగానే సూపర్ సక్సెస్ లు అందుకున్న శ్రీలీల ఆ క్రేజ్ తో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. అంతేనా వరుస స్టార్ ఛాన్స్ లతో అదరగొట్టేస్తుంది. ధమాకా హిట్ తో వరుసగా ఐదారు సినిమాల ఆఫర్లు రాగా మరో ఆలోచన లేకుండా అమ్మడు సినిమాలు చేస్తూ వచ్చింది. ఐతే వాటిలో అమ్మడికి సక్సెస్ ఇచ్చిన సినిమాలు చాలా తక్కువ. బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి హిట్ కాగా మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా కాస్త పర్వాలేదు అనిపించుకుంది.
అనతికాలంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుని డ్యాన్సుల్లో తన టాలెంట్ చూపిస్తున్న శ్రీలీల ఈమధ్యనే వచ్చిన రాబిన్ హుడ్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఐతే సినిమా మీద అంచనాలు ఎక్కువ అవ్వడంతో పాటు వెంకీ కుడుముల, నితిన్ కాంబో సినిమా పై క్రేజ్ ఎక్కువ అవ్వడం వల్ల సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఐతే ఈ సినిమా తో తెలుగులో హిట్టు కొట్టేద్దాం అనుకున్న శ్రీలీలకు షాక్ తగిలింది.
ఇక నెక్స్ట్ మాస్ మహారాజ్ తో మాస్ జాతర సినిమా చేస్తుంది శ్రీలీల. ఈ సినిమాతో అయినా అమ్మడు సూపర్ హిట్ కొడుతుందేమో చూడాలి. ఐతే శ్రీలీల ప్రస్తుతం తమిళంలో కూడా ఒక సినిమా చేస్తుంది. అక్కడ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో పరాశక్తి సినిమాలో నటిస్తుంది అమ్మడు. తమిళ్ లో చేస్తున్న తొలి సినిమా అవ్వడంతో పరాశక్తి మీద చాలా హోప్స్ పెట్టుకుంది శ్రీలీల. మరోపక్క తెలుగులో కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు అందుకే అమ్మడు పరాశక్తి మీద ఫుల్ ఫోకస్ చేస్తుంది.
పరాశక్తి సినిమాను సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పీరియాడికల్ మూవీగా రాబోతుంది. స్టూడెంట్ లీడర్ గా శివ కార్తికేయన్ అదరగొట్టబోతున్నాడు. మరి పరాశక్తి సినిమా శ్రీలీలకు సక్సెస్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి. శివ కార్తికేయన్ తో పాటుగా ఈ సినిమాలో జయం రవి విలన్ గా నటిస్తున్నాడు. సినిమాలో అథర్వ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు.
రీసెంట్ గా రిలీజైన పరాశక్తి గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. మరి శ్రీలీలకు ఈ మూవీ అమ్మడి కెరీర్ సక్సెస్ మేనియా కొనసాగించేందుకు హెల్ప్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.