Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో శ్రీలీల చుట్ట‌రికం!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు అంటే? ఎక్కువ‌గా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారే ఉంటారు. అడ‌పా ద‌డ‌పా మాత్రం తెలుగు హీరోయిన్లు అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటారు.

By:  Tupaki Desk   |   16 March 2025 9:00 PM IST
టాలీవుడ్ లో శ్రీలీల చుట్ట‌రికం!
X

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు అంటే? ఎక్కువ‌గా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారే ఉంటారు. అడ‌పా ద‌డ‌పా మాత్రం తెలుగు హీరోయిన్లు అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటారు. ఇలాంటి వారికి ఇండ‌స్ట్రీలో కూడా ఎలాంటి చుట్ట‌రికాలు కూడా ఉండ‌వు. అయితే తెలుగు హీరోయిన్ శ్రీలీల కు మాత్రం మంచి చుట్ట‌రికాలే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. న‌టుడు రానా, ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడికి శ్రీలీల దూర‌పు బంధువులా క‌నిపిస్తుంది.

ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో రానా తాను త‌న ఫ్యామిలీలో ఏ ఫంక్ష‌న్ కు వెళ్లిన అక్కడ శ్రీలీల క‌నిపిస్తుంద‌న్నాడు. తాను వెళ్లి అడిగితే వాళ్లు మా చుట్టాల‌నేని శ్రీలీల చెబుతుందట‌. అంటే రానాకి-శ్రీలీల‌కు దూర‌పు బంధుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అలాగే అనీల్ రావిపూడికి కూడా శ్రీలీల‌కు బంధుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. వాళ్లు ఇద్ద‌రు ఎక్క‌డిక‌క్క‌డ ఫ్యామిలీ ఈవెంట్ల‌లో తార‌స ప‌డుతున్నారట‌.

ఇదంతా బాగానే ఉంది. మ‌రి వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం శ్రీలీల‌కు ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. రానా ఇప్ప‌టికే కొత్త సినిమా ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. కొంత కాలంగా ఆయ‌న కూడా నిర్మాత‌గా బిజీగా క‌నిపి స్తున్నాడు. న‌టుడిగా కంటే? నిర్మాణంలో దూకుడు చూపిస్తున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం వెండి తెర‌పై మెర‌వాల‌ని చూస్తున్నాడు. రానిని తెర‌పై చూసి అభిమానుల‌కు చాలా రోజులైంది.

వాళ్ల కోరిక మేర‌కు ఈ ఏడాది మాత్రం కొత్త సినిమాతో రావాల‌ని చూస్తున్నాడు. మ‌రి అందులో చుట్టాల మ్మాయికి ఛాన్స్ ఇస్తే స‌రి. అటు అనీల్ రావిపూడి డైరెక్ట‌ర్ గా బిజీ. స్టార్ల‌తోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న తో క‌లిసి శ్రీలీల 'భ‌గ‌వంత్ కేస‌రి'లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికిప్పుడు అనుకుంటే చిరంజీవి సినిమాలోనైనా మ‌రో అవ‌కాశం ఇవ్వ‌గ‌ల‌డు. మ‌రి అనీల్ ఏమంటాడో.