ఐటమ్ సాంగ్ అమ్మడి కెరీర్ ను ట్రాక్ లో పెట్టిందిగా!
ఇప్పుడు మరో నాలుగు కొత్త ప్రాజెక్ట్స్ కు ఓకే చేసింది. ఇందులో భాగంగా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి కూడా రెడీ అయింది. రీసెంట్ గానే ఈ సినిమా ప్రారంభమైంది.
By: Tupaki Desk | 16 Dec 2024 1:30 AM GMT'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది యంగ్ సెన్సేషన్ శ్రీలీల. ఎంట్రీతోనే తన డ్యాన్సులతో, అంద చందాలతో యువ హృదయాలను కొల్లగొట్టింది. 'ధమాకా'తో దుమ్ము దులిపేపిన ఈ బ్యూటీ.. తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకుంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్నాళ్ళపాటు ఇండస్ట్రీలో తన హవా కొనసాగించింది. 'గుంటూరు కారం' తర్వాత అమ్మడి కెరీర్ కాస్త స్లో అయింది. అంతకముందు వరుస ఫ్లాపులు పడటం, స్టడీస్ మీద ఫోకస్ పెట్టడం కూడా దీనికి కారణం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ, స్పీడ్ పెంచింది.
ఇటీవల 'పుష్ప 2' సినిమాలో 'కిస్సిక్' అనే ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ను అలరించింది శ్రీలీల. దీంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఎప్పటిలాగే వరుసగా సినిమాలు కమిట్ అవుతూ బిజీగా మారుతోంది. ఇప్పటికే నాలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ అందాల భామ.. ఇప్పుడు మరో నాలుగు కొత్త ప్రాజెక్ట్స్ కు ఓకే చేసింది. ఇందులో భాగంగా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి కూడా రెడీ అయింది. రీసెంట్ గానే ఈ సినిమా ప్రారంభమైంది.
'అమరన్' తో సంచలన విజయం సాధించిన శివ కార్తికేయన్ తో జోడీ శ్రీలీల కట్టబోతోంది. ఆయన హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ భామనే హీరోయిన్ గా తీసుకున్నారు. 'SK 25' అనే వర్కింగ్ టైటిల్ తో శనివారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇది శ్రీలీల కు తమిళ్ డెబ్యూ. ఇందులో జయం రవి, అధర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక తెలుగులో అక్కినేని బ్రదర్స్ ఇద్దరితో ఒకేసారి సినిమాలు చేయబోతోంది శ్రీలీల.
అక్కినేని అఖిల్ హీరోగా 'Akhil 6' మూవీ షూటింగ్ ను మొదలుపెట్టారు. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు. మనం ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు అక్కినేని నాగచైతన్య సరసన కూడా శ్రీలీల నటించనుంది. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NC 24' లో అమ్మడినే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇలా అన్నదమ్ముల ఇద్దరితో ఒకేసారి రొమాన్స్ చేయబోతోంది.
తెలుగులో ఇప్పటికే రవితేజతో కలిసి 'మాస్ జాతర' అనే మూవీ చేస్తోంది శ్రీలీల. నితిన్ పక్కన చేసిన 'రాబిన్ వుడ్' సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఆమె ఒక హీరోయిన్ గా కనిపించనుంది. ఇక నవీన్ పోలిశెట్టితో 'అనగనగా ఒక రాజు' సినిమా చేస్తోంది. అప్పుడెప్పుడో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ను జనవరిలో తిరిగి సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని చూస్తున్నారు. ఇది కాకుండా సితార బ్యానర్ లో సిద్ధూ జొన్నలగడ్డతో శ్రీలీలా ఓ మూవీ కమిట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
ఓవరాల్ గా శ్రీలీల చేతిలో ప్రస్తుతం 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 4 సినిమాలు సితార బ్యానర్ లో, 2 మైత్రీ మూవీ మేకర్స్ లో రాబోతున్నాయి. వాటిల్లో కొన్ని హిట్టయినా అమ్మడికి సౌత్ ఇండస్ట్రీలో తిరుగుండదు. ఏదేమైనా కిస్సిక్ సాంగ్ ఆమె కెరీర్ ను మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొస్తున్నట్లు అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ హవా ఎలా కొనసాగుతుందో చూడాలి.