Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు 'సింగిల్' గ్లింప్స్ - దరిద్రానికి దత్తపుత్రుడు

టాలీవుడ్ లో డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేసే అతికొద్ది మంది హీరోలలో శ్రీ విష్ణు టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 11:30 AM GMT
శ్రీవిష్ణు సింగిల్ గ్లింప్స్ - దరిద్రానికి దత్తపుత్రుడు
X

టాలీవుడ్ లో డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేసే అతికొద్ది మంది హీరోలలో శ్రీ విష్ణు టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తన 18వ సినిమాతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ను హైలెట్ చేయనున్నట్లు అర్ధమవుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై కార్తిక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి నిర్మితమవుతోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇస్తూ స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. టైటిల్ పోస్టర్‌లో శ్రీ విష్ణు మాస్ లుక్‌లో కనిపిస్తారు. ఒక చేతిలో మ్యూజిక్ సిస్టమ్, మరొక చేతిలో సుత్తిల్ బాంబ్ పట్టుకుని నిలబడి ఉండటం విశేషం. ఇందులో సింగిల్ అనే స్పెషల్ ట్యాగ్ తో కనిపిస్తారని అర్ధమవుతుంది. ఈ లుక్ యువతను బాగా ఆకర్షిస్తోంది. టైటిల్ గ్లింప్స్ కూడా మేకర్స్ వినోదాన్ని మేళవిస్తూ తీర్చిదిద్దారు.

టైటిల్ గ్లింప్స్ లో మొదట వెన్నెల కిశోర్ 35 ఏళ్ల వయసు వచ్చినా ఎందుకు ఇంకా సింగిల్‌గా ఉన్నాడో వివరిస్తూ నవ్వులు పంచారు. దానికి కారణం దరిద్రానికి దత్తపుత్రుడు అంటూ శ్రీవిష్ణు క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఓ పార్క్‌లోకి ఎంట్రీ ఇస్తూ, మ్యూజిక్ సిస్టమ్‌ మోగిస్తూ, రొమాంటిక్ వాతావరణాన్ని అల్లకల్లోలం చేసినట్లు చూపించారు.

ఎర్రని బెలూన్లు పేల్చడం, ప్రేమికులపై తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యవహరించడం గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆసక్తికరంగా, ఇద్దరు అమ్మాయిలు అతన్నీ ప్రేమిస్తున్నా, ఇంకా ఒంటరిగా ఉన్నట్లు చూపించారు. ఇదే సినిమాలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు కథలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.

శ్రీ విష్ణు తన లుక్‌ను పూర్తిగా మార్చేసి, గడ్డంతో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రేమను అసహ్యించుకునే ఓ సింగిల్ వ్యక్తిగా ఆయన పాత్ర వినోదాన్ని పంచనుంది. ‘ఒంటరి వాడిని..’ అనే సాంగ్ నేపథ్య సంగీతంగా వినిపించడం, ఈ గ్లింప్స్‌కు మరింత ఆసక్తి రేకెత్తించింది. సాంకేతిక పరంగా కూడా ఈ చిత్రం హై స్టాండర్డ్స్‌లో రూపొందుతోంది. ఆర్.వెల్‌రాజ్ అందించిన విజువల్స్ ఎంతో కలర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ప్రశాంతంగా సాగే లవ్ స్టోరీల కంటే మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. టైటిల్, గ్లింప్స్, శ్రీ విష్ణు మేకోవర్ అన్నీ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమను తట్టుకోలేని ఓ యువకుడి కథను వినోదంతో మిక్స్ చేస్తూ దర్శకుడు కార్తిక్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా రిలీజ్ సమయానికి ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.