శ్రీవిష్ణు.. ఈ క్యారెక్టర్ అసలు ఊహించనిదే..
ఇక తాజాగా 'స్వాగ్' అనే మూవీతో శ్రీవిష్ణు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలో ఏకంగా నాలుగు టైమ్ లైన్స్ లో నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు.
By: Tupaki Desk | 5 Oct 2024 11:30 AM GMTటాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ నటుల జాబితాలో ఇప్పుడు శ్రీవిష్ణు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సైడ్ క్యారెక్టర్స్ తో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో హీరోగా ప్రమోట్ అయ్యాడు. తరువాత 'అప్పట్లో ఒకడుండేవాడు', 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'రాజరాజచోర', 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' లాంటి సినిమాలతో శ్రీవిష్ణు హీరోగా తన ఇమేజ్ పెంచుకుంటూ వచ్చాడు. అలాగే నటుడిగా ఎప్పటికప్పుడు తనలో వేరియేషన్స్ చూపిస్తూ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంటున్నాడు.
శ్రీవిష్ణు పాత్రల ఎంపిక చాలా విభిన్నంగా ఉంటుందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. హీరోగా ఎవ్వరు టచ్ చేయని స్టోరీ లైన్స్ పిక్ చేసుకుంటాడు. హంగులు ఎలివేషన్స్ కాకుండా క్యారెక్టర్స్ పరంగా కూడా తనని తాను తగ్గించుకుంటూ విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన 'ఓం భీమ్ బుష్' సినిమాలో ఏకంగా గే రొమాన్స్ తో శ్రీవిష్ణు అందరికి షాక్ ఇచ్చాడు. నిజానికి ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి ఫేమ్ ఉన్న హీరోలు ఎవరూ ఒప్పుకోరు.
అయితే శ్రీవిష్ణు సాహసం చేసి సక్సెస్ అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా 'స్వాగ్' అనే మూవీతో శ్రీవిష్ణు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలో ఏకంగా నాలుగు టైమ్ లైన్స్ లో నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక యునిక్ స్టైల్ ఉండేలా పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇందులో ఇంకో ప్రత్యేకత ఉంది. అది ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్. టాలీవుడ్ లో ఈ జెనరేషన్ లో ఫేమ్ ఉన్న ఏ హీరో కూడా ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు.
గతంలో 'నర్తనశాల' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ బృహన్నల పాత్రలో నటించి మెప్పించారు. ఆ తరువాత అలాంటి పాత్రలో శ్రీవిష్ణు తనదైన శైలిలో నటించి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ లాంటి హీరోలు ఇలాంటి పాత్రలో కనిపించడానికైనా వెనుకాడరు. కోలీవుడ్ లో కూడా యంగ్ హీరోలలో శివ కార్తికేయన్, కెవిన్ లాంటి వారు విభిన్న పాత్రలు చేస్తూ ఉంటారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా ఏ పాత్ర అయిన చేయడానికి రెడీ అయ్యే నటుడిగా శ్రీవిష్ణు తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఈ ఇమేజ్ భవిష్యత్తులో శ్రీవిష్ణుకి మరిన్ని విభిన్న కథలతో సినిమాలు చేసే స్కోప్ ఇస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. స్వాగ్ మూవీ కమర్షియల్ సక్సెస్ అయితే శ్రీవిష్ణు కూడా ప్రయోగాలు చేయడానికి వెనుకాడకపోవచ్చు.