భుజంపై చేయి వేసి అసహ్యంగా చూసాడు!
ఓ సినిమా కోసం డైరెక్టర్ పిలిచాడు. అప్పుడు అమ్మ నాతో లేదు. దీంతో నేను సింగిల్ గానే వెళ్లాను. అదును చూసి నాభుజం పై చేయి వేసి నెమిరాడు.
By: Tupaki Desk | 9 March 2024 1:30 AM GMTఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశం అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా తమకెదురైన అనుభవాల్ని నటీనటులంతా ఓపెన్ అయ్యారు. స్టార్ భామల దగ్గర నుంచి చిన్న స్థాయి..టీవీ నటీమణుల వరకూ అంతా ఓపెన్ అయిన వారే. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ 16 కంటెంస్టెంట్ శ్రీజిత దే ఇండస్ట్రీ లో ఎదుర్కున్న కొన్న సంఘటనల గురించి రివీల్ చేసింది. ఓ సినిమా ఛాన్స్ కోసం డైరెక్టర్ దగ్గరకు వెళ్తే అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.
'17 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చాను. నాతో ఎప్పుడూ మా అమ్మ కూడా ఉండేది. అమ్మ దగ్గర ఏ విషయం దాచే దాన్ని కాదు. కానీ ఇండస్ట్రీలో కొంత మంది చెడ్డ మనుషుల మద్య తిరగాల్సి వచ్చింది. ఛాన్సులు పేరు తో..మీటింగ్ లు పేరుతో ఆఫీస్ లకు పిలిపించి టైంపాస్ చేసేవారు. మరికొంత మంది ఎలాంటి మెహ మాటం లేకుండా కమిట్ మెంట్ అడిగేసేవారు. వీటన్నింటిలో నన్ను భయపెట్టిన ఘటన ఒకటుంది.
ఓ సినిమా కోసం డైరెక్టర్ పిలిచాడు. అప్పుడు అమ్మ నాతో లేదు. దీంతో నేను సింగిల్ గానే వెళ్లాను. అదును చూసి నాభుజం పై చేయి వేసి నెమిరాడు. నాతో మాట్లాడే విధానం తేడాగా ఉంది. అతడి ప్రవర్తన ఎలాంటి మహిళకు అయినా తప్పుడు ఉద్దేశంతో ఉన్నాడని అనిపించేలా తెలిసిపోతుంది. నన్ను చూసిన తీరు అస హ్యంగా ఉండటంతో అక్కడే ఉన్న నా పర్స్ తీసుకుని పరిగెట్టుకుని వచ్చేసాను' అని తెలిపింది.
శ్రీజితకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మడు నార్త్ నుంచి ఇండస్ట్రీకి వచ్చింది. బెంగా లీ పాత్రలతో వెలుగులోకి వచ్చింది. కొన్ని టీవీ షోలు చేసింది. అక్కడ నుంచి బిగ్ బాస్ కి ప్రమోట్ అయింది. ఉత్తరాన్..తుమ్ హీ హో బంధు సఖా తుమ్హీ..లేడీస్ స్పెషల్.. లాల్ ఇష్క్.. యే జాదు హై జిన్ కాలాంటి షోలతో బాగా ఫేమస్ అయింది.