అడ్డాల- అబ్బవరం సెట్ అవుతుందా?
శ్రీకాంత్ కు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గోదావరి బ్యాక్ డ్రాప్ లో మంచి ఎమోషన్స్ తో కూడిన కథను రెడీ చేయమని చెప్పారట.
By: Tupaki Desk | 13 March 2025 7:00 AM ISTఓ సినిమా దానికి పని చేసిన వారి కెరీర్ నే మార్చేస్తుంది. టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఈ లిస్టులోకి వస్తారు. వరుణ్ సందేశ్ తో చేసిన కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా శ్రీకాంత్ కెరీర్ నే మార్చేసింది.
కొత్త బంగారు లోకం హిట్ అవడంతో ఓ ఫ్యామిలీ కథ రాసుకుని దాన్ని టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబుకి చెప్పి వాళ్లను ఒప్పించి అప్పట్లోనే మల్టీస్టారర్ తీసి ఓ ట్రెండ్ సృష్టించారు శ్రీకాంత్. రెండో సినిమాకే అంత పెద్ద స్టార్లను ఒప్పించడమంటే మాటలు కాదు. ఒప్పించడమే కాకుండా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నారు శ్రీకాంత్.
ఆ కారణంతోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను లాంచ్ చేసే ఛాన్స్ శ్రీకాంత్ కే ఇచ్చింది మెగా ఫ్యామిలీ. ఆ సినిమా సూపర్ హిట్ అవకపోయినా వరుణ్ లో విషయముందని అందరికీ తెలిసేలా చేశారు. కానీ ఆ తర్వాత శ్రీకాంత్ మీద ఎంతో నమ్మకముంచి మహేష్ బ్రహ్మోత్సవం అవకాశమిస్తే ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు.
బ్రహ్మోత్సవం దెబ్బతో శ్రీకాంత్ మళ్లీ ఆరేళ్ల వరకు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు. మళ్లీ వెంకటేష్ తో నారప్ప మూవీ చేశారు కానీ అది రీమేక్ అవడంతో స్పెషల్ గా ఆయన టాలెంట్ ఏమీ కనిపించలేదు. మొన్నామధ్య వచ్చిన పెద కాపు ఎంతో హైప్ తో రిలీజైంది కానీ దారుణంగా ఫ్లాపైంది. దీంతో ఇక శ్రీకాంత్ అడ్డాల పనైపోయిందనుకున్నారంతా.
కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ తర్వాత అతనికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ కు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గోదావరి బ్యాక్ డ్రాప్ లో మంచి ఎమోషన్స్ తో కూడిన కథను రెడీ చేయమని చెప్పారట. కథ నచ్చితే సినిమా చేయడానికి కిరణ్ రెడీగా ఉన్నాడట. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ పలుమార్లు కలుసుకున్నారని, సీతమ్మ వాకిట్లో రీరిలీజ్ ను కిరణ్ ఫస్ట్ డే చూడటానికి కూడా రీజన్ ఇదే అని అంటున్నారు. అయితే శ్రీకాంత్ మంచి కథతో కిరణ్ ను మెప్పిస్తేనే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే వీలుంది.