Begin typing your search above and press return to search.

శ్రీలీల.. 'గేమ్ ఛేంజర్' గా మారాల్సిందే!!

అందం, అభినయంతో ఓ రేంజ్ లో అలరించే శ్రీలీల టాలెంట్ కోసం ఎంత చెప్పినా తక్కువే.

By:  Tupaki Desk   |   30 March 2025 2:45 AM
శ్రీలీల.. గేమ్ ఛేంజర్ గా మారాల్సిందే!!
X

టాలీవుడ్ హీరోయిన్, క్యూట్ బ్యూటీ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. యంగ్ హీరో రోషన్ పెళ్లి సందD సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల.. అతి తక్కువ సమయంలోనే వేరే లెవెల్ పాపులారిటీ సంపాదించుకుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఏకంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది అమ్మడు.

అందం, అభినయంతో ఓ రేంజ్ లో అలరించే శ్రీలీల టాలెంట్ కోసం ఎంత చెప్పినా తక్కువే. డ్యాన్స్ విషయంలో తోప్ అని చెప్పాలి. తన స్టెప్పులు, ఎక్స్ప్రెషన్స్ తో సింపుల్ గా అదరగొట్టేస్తుంది. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప-2లో కిస్సిక్ సాంగ్ తో అందరినీ మెప్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఓ ఊపు ఊపేసింది బ్యూటీ.

అయితే పెళ్లిసందD మూవీ తర్వాత ధమాకాలో నటించిన శ్రీలీల.. మంచి హిట్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు.. నెవ్వర్ బిఫోర్ అనేలా ఆఫర్స్ ను దక్కించుకుంది. కానీ సక్సెస్ రేట్ విషయంలో వెనుకంజలో ఉంది బ్యూటీ. ధమాకా తర్వాత సరైన హిట్ ఆమెకు ఇంకా దక్కలేదు.

ధమాకా తర్వాత స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, రాబిన్‌ హుడ్ వంటి సినిమాల్లో వరుసగా నటించింది. వాటిలో భగవంత్ కేసరి మంచి హిట్ అని చెప్పవచ్చు. కానీ ఆమె మూవీలో మెయిన్ హీరోయిన్ మాత్రం కాదు. బాలయ్య కుమార్తెగా కనిపించిన శ్రీలీల.. తన యాక్టింగ్ తో మెప్పించిందనే చెప్పాలి.

గుంటూరు కారం భారీ అంచనాల మధ్య రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది. కానీ టాక్ మాత్రం మిక్స్ డ్ గానే వచ్చింది. ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తున్న శ్రీలీల.. రీసెంట్ గా రాబిన్ హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ నటుడు నితిన్ హీరోగా నటించిన ఆ సినిమాను వెంకీ కుడుములు గ్రాండ్ గా తెరకెక్కించారు.

మంచి హిట్ అవుతుందని అంతా అనుకోగా.. కేవలం నవ్వులు మాత్రమే పంచుతున్నట్లు రివ్యూస్ వచ్చాయి. కంటెంట్ ఓకే అయినా.. ఇంకాస్త వర్క్ చేయాల్సి ఉందని అనేకమంది అభిప్రాయపడ్డారు. దీంతో శ్రీలీలకు మళ్లీ సరైన హిట్ దక్కలేదని చెప్పవచ్చేమో. దీంతో ఇప్పుడు తన కెరీర్ ను ఫుల్ ట్రాక్ లో పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది.

స్క్రిప్ట్ ఎంపికపై శ్రీలీల సీరియస్ గా దృష్టి పెట్టాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. తన తదుపరి ప్రాజెక్టులు అటు కమర్షియల్ ఇటు కంటెంట్ పరంగా విజయం సాధించేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. కొత్త స్క్రిప్ట్‌ లను సరైన రీతిలో ఎంచుకుని గేమ్ ఛేంజర్ గా మారాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. మరి చూడాలి శ్రీలీల కొత్త సినిమాలు ఎలా ఉంటాయో..