మహేష్ కోసం ముంబై కూడా అరుస్తుందా!
ముందు వరుసలో కూర్చున్న గ్యాంగ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతీ స్టార్ హీరో సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో చూసే సన్నివేశమే ఇది.
By: Tupaki Desk | 23 Dec 2024 2:30 AM GMTతెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే? రెండు..మూడు రోజుల పాటు థియేటర్లలో హడావుడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అభిమానులతో దద్దరిల్లుతుంది. హీరో టైటిల్ పడగానే విజిల్స్ , కేకలేస్తూ, తెరపైకి కాగితం ముక్కలు ఎగరేస్తూ అభిమానం చాటుకుంటారు. ముందు వరుసలో కూర్చున్న గ్యాంగ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతీ స్టార్ హీరో సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో చూసే సన్నివేశమే ఇది.
మరి ముంబై థియేటర్లలో కూడా ఓ హీరో విషయంలో ఇలాగే ఉంటుందా? అంటే అవుననే అంటోంది శ్రీలీల. ఇంతకీ ఎవరా హీరో? అంటే ఆ వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆ హీరో ఎవరో కాదు. సూపర్ స్టార్ మహేష్. ఇద్దరు కలిసి `గుంటూరు కారం`లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తొలి షోని శ్రీలీ ముంబై లోని ఓ థియేటర్లో చూసిందిట. ఆ సినిమా రిలీజ్ సమయానికి ముంబైలో ఉండటంతో? అక్కడ థియేటర్లో చూడాల్సి వచ్చిందని తెలిపింది.
కానీ థియేటర్లో మహేష్ బొమ్మ పడగానే అభిమానులంతా ఒక్కసారిగా పైకి లేచి హడావుడి చేసారుట. అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిల్లిపోయిందని తెలిపింది. ఆ సౌండ్ పొల్యూషన్ కి తన చెవులు మోతెక్కిపోయాయంది. ముంబై థియేటర్లో ఓ తెలుగు హీరో సినిమాకి ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంటుందని అస్సలు ఊహించ లేదంది. దీంతో ముంబైలో కూడా మహేష్ కి అభిమానులు మాములుగా లేరని అర్దమవుతుంది.
మహేష్ ఇంత వరకూ హిందీ సినిమాలు చేయలేదు. కానీ డబ్బింగ్ రూపంలో రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా బిజినెస్ మ్యాన్ సినిమా హిందీలో మహేష్ కి మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టింది. మహేష్ ఎలివేషన్లు సీన్లు ముంబై ధారావాలోనే షూట్ చేసారు. స్టోరీ అక్కడ బ్యాక్ డ్రాప్ లో సాగడంతో షూటింగ్ అంతా కూడా అక్కడే చేసారు. ఆ సినిమాకి బాలీవుడ్ హీరోయిన్లే కాదు...స్పోర్స్ట్ పర్సన్స్ కూడా అభిమానులుగా మారారు.