మీనాక్షి ఛాన్స్ శ్రీలీల తన్నుకుపోయిందా!
మీనాక్షి చౌదరి సక్సెస్ పుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లోనూ వరుసగా అవకాశాలు అందుకుంటూ తనదైన మార్క్ వేస్తుంది.
By: Tupaki Desk | 11 Dec 2024 7:30 AM GMTమీనాక్షి చౌదరి సక్సెస్ పుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లోనూ వరుసగా అవకాశాలు అందుకుంటూ తనదైన మార్క్ వేస్తుంది. రష్మిక మందన్నా తర్వాత ఆ రేంజ్ లో ఫేమస్ అవుతున్న బ్యూటీ మీనాక్షి. అలాంటి నటి అవకాశాన్నే తెలుగు హీరోయిన్ శ్రీలీల తన్నుకుపోయిందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా 24వ చిత్రాన్ని కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
`విరూపాక్ష` తర్వాత కార్తీక్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. మిథికల్ త్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇందులో చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి అనుకున్నారు. కానీ మీనాక్షి స్థానంలో అనూహ్యంగా శ్రీలీల చేరింది. మీనాక్షి బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో లీలకు ఆ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మరో హీరోయిన్ స్థానంలో శ్రీలీల రీప్లేస్ అన్నది కొత్తది కాదు.` గుంటూరు కారం`లో పూజాహెగ్డే సగం షూటింగ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయితే శ్రీలీలను తీసుకున్నారు.
`పుష్ప-2`లో కిస్సుక్కు సాంగ్ కోసం ఎంతో మంది భామల పేర్లను పరిశీలించారు. చివరికి బాలీవుడ్ కి వెళ్లారు. జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటాని ఇలా ఎన్నో ఆప్షన్లు పరిశీలించాక చివరిగా శ్రీలీల కే ఆఛాన్స్ వరించింది. నితిన్ హీరోగా నటిస్తోన్న `రాబిన్ హుడ్` లో ముందుగా రష్మిక మందన్నాని అనుకున్నారు. కానీ ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ ఛాన్స్ శ్రీలీలకే సొంతమైంది.
ఇలా శ్రీలీలకు రీప్లేసింగ్ బ్యూటీగా పేరొచ్చింది. మరొకరి అవకాశాల్లో ఇంకొకరు నటించాలంటే? సెకెండ్ ఆప్షన్ తాను అనే ఫీలింగ్ సహజం. కానీ శ్రీలీల మాత్రం అలాంటి నెగిటివిటకీ ఎక్కడా తావు ఇవ్వకుండా ఎంతో బ్యాలెన్స్ గా వ్యవహరిస్తుంది. వచ్చిన అవకాశాలు తెలివిగా ఒడిసి పట్టుకుంటుంది.