బాలీవుడ్ ఫోకస్ మొత్తం వారిపైనే!
రీసెంట్ గా రాబిన్‌హుడ్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీలీల ప్రస్తుతం తెలుగుతో పాటూ తమిళ, హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉంది.
By: Tupaki Desk | 4 April 2025 7:25 AMరీసెంట్ గా రాబిన్‌హుడ్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీలీల ప్రస్తుతం తెలుగుతో పాటూ తమిళ, హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాతోనే శ్రీలీల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూశాక కార్తీక్ ఆర్యన్, శ్రీలీల నటిస్తున్న సినిమా ఆషికి3 అని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే శ్రీలీల తన బాలీవుడ్ హీరో తో ప్రేమలో ఉందని కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో నిజమెంతన్నది పక్కన పెడితే బాలీవుడ్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం చాలా సహజం. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్, శ్రీలీల ఇద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన పిక్స్ చూస్తుంటే సినిమాలో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ మధ్య కెమిస్ట్రీ నెక్ట్స్ లెవెల్ లో వర్కవుట్ అయినట్టు తెలుస్తోంది. ఆ ఫోటోల్లో కార్తీక్, శ్రీలీల బైక్ పై ఉన్న ఫోటోలు సెట్స్ నుంచి బయటకు రాగా ఆ ఫోటోల్లో ఇద్దరి జంట చూడముచ్చటగా అనిపిస్తోంది. మూవీలో కూడా వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ను మాత్రం ఫిక్స్ చేయలేదు. కానీ లీకైన ఫోటోలు చూసి నెటిజన్లు మాత్రం ఆషిఖి2 తో కంపేర్ చేసి చూస్తూ ఇది ఆషికి3 సినిమా అంటున్నారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ లాంగ్ హెయిర్, పెరిగిన గుబురు గడ్డంతో చాలా రఫ్ అండ్ రగ్గ్‌డ్ లుక్ లో కనిపిస్తుంటే శ్రీలీల మాత్రం చాలా క్యూట్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను డిసైడ్ చేసి అనౌన్స్ చేసే వీలుంది. కాగా లీకైన ఫోటోల్లో కార్తీక్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ఇప్పుడు బీటౌన్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.