Begin typing your search above and press return to search.

కిసిక్ బ్యూటీకి క‌సెక్కించే ఆఫ‌రా?

అప్ప‌టి వ‌ర‌కూ హీరోయిన్ గా సినిమాలు చేసిన అమ్మ‌డు ఒక్క సారిగా ఐటం భామ‌గా తెర‌పై క‌నిపించే స‌రికి కొత్త ఇమేజ్ ఫామ్ అయింది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 1:30 AM GMT
కిసిక్ బ్యూటీకి క‌సెక్కించే ఆఫ‌రా?
X

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్న‌ట్లు! ఒక్క పాట శ్రీలీల జీవితంలో ఓ కొత్త ట‌ర్నింగ్ నే తీసుకొస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'పుష్ప‌-2' లోని కిసిక్ పాట‌తో పాన్ ఇండియాలో అమ్మ‌డు ఓ వెలుగు వెలిగిన సంగ‌తి తెలిసిందే. కిస్ కిస్ కిసిక్ అంటూ కుర్రాళ్ల‌ను ఓ ఊపు ఊపేసింది. అప్ప‌టి వ‌ర‌కూ హీరోయిన్ గా సినిమాలు చేసిన అమ్మ‌డు ఒక్క సారిగా ఐటం భామ‌గా తెర‌పై క‌నిపించే స‌రికి కొత్త ఇమేజ్ ఫామ్ అయింది.

శ్రీలీల మంచి డాన్స‌ర్ కావ‌డంతో? ఆ ఛాన్స్ వ‌రించింది. పాట‌లో అమ్మ‌డి ఎక్స్ ప్రెష‌న్స్, హిప్ మూవ్ మెంట్స్ ప్ర‌తీది యూత్కి ప‌ర్పెక్ట్ గా క‌నెక్ట్ అయింది. దీంతో శ్రీలీల‌కు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో ఐటం పాటల్లో న‌ర్తించే అవ‌కాశాలే వ‌స్తున్నాయ‌ని వినిపిస్తుంది. సొగ‌స‌రిని రెండు బిగ్ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్ ఐటం పాట కోసం అప్రోచ్ అయిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఇదే నిజ‌మైతే శ్రీలీల కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న‌ట్లే. బాలీవుడ్ లో ఐటం పాట‌ల‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది.

స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశం వ‌స్తే హీరోయిన్లే ఐటం భామ‌లుగా మారిపోతారు. అలాగే ఐటం పాట‌ల‌కంటూ కొంత మంది స్పెష‌లిస్ట్ లు ఉన్నారు. మ‌లైకా అరోరా, జాక్వెలిన్ పెర్నాండేజ్, నోరా ప‌టేహీ, మ‌ల్లికా షెరావ‌త్ లాంటి వాళ్లు ఐటం భామ‌లుగా ఎంతో ఫేమ‌స్. క‌రీనా క‌పూర్, క‌త్రినా కైఫ్ లాంటి వాళ్లు ఐటం పాట‌ల్లో న‌టించారు. వాళ్ల‌ను దాటి ఐటం పాట మ‌రో భామకు రావ‌డం అన్న‌ది అంత సుల‌భం కాదు. కానీ ఇప్పుడా బోర్డ‌ర్ ను శ్రీలీల దాటుతున్న‌ట్లే క‌నిపిస్తుంది.

వ‌చ్చిన అవ‌కాశాల్ని వినియోగించుకోగ‌ల్గితే శ్రీలీల మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోతుంది. మ‌రి ఆ ఛాన్స్ తీసుకుంటుందా? లేదా? అన్న‌ది చూడాలి. అయితే శ్రీలీల పెద్ద హీరోయిన్ అవ్వాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. టాలీవుడ్ లో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. మ‌రి ఇలాంటి

స‌మ‌యంలో ఐటం పాట‌లకు రైట్ టైమ్ ? అన్న‌దా? ఆలోచించాల్సిన విష‌య‌మే.