శ్రీలీల డ్యాన్స్ వీడియో.. ఏం గ్రాస్ ఉందిరా బాబు!
పొట్టి డ్రెస్ వేసుకున్న శ్రీలీల.. క్రేజీ సాంగ్ కు చిందులేస్తూ కనిపించింది. ఫుల్ గా నవ్వుతూ సరదాగా చిల్ అవుతూ స్టెప్పులు వేసింది.
By: Tupaki Desk | 1 Feb 2025 5:32 PM GMTటాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఏ సాంగ్ కు ఆమె చిందులేసినా.. అదిరిపోతుందంతే.. అంతలా డ్యాన్స్ లో తన గ్రాస్ ను చూపిస్తుంది. అటు అందాలు.. ఇటు హావాభావాలతో ఉర్రూతలూగిస్తుంది. అలా తన డ్యాన్స్ తో వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ.
రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీలో కిస్సిక్ సాంగ్ తో సందడి చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తో అదిరిపోయే స్టెప్పులు వేసి మైండ్ బ్లాక్ చేసింది. తన ఎక్స్ప్రెషన్స్ తో ఫిదా చేసిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తాజాగా శ్రీలీల డ్యాన్స్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పొట్టి డ్రెస్ వేసుకున్న శ్రీలీల.. క్రేజీ సాంగ్ కు చిందులేస్తూ కనిపించింది. ఫుల్ గా నవ్వుతూ సరదాగా చిల్ అవుతూ స్టెప్పులు వేసింది. సింపుల్ స్టెప్స్ వేసినా.. ఆమె గ్రేస్ క్లియర్ గా తెలుస్తోంది. దీంతో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. అమ్మడి డ్యాన్స్ సూపర్ గా ఉందని.. సో నైస్ మేడమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక శ్రీలీల కెరీర్ విషయానికొస్తే.. 2017లో చిత్రాంగద మూవీతో టాలీవుడ్ కు బాలనటిగా పరిచయమైంది. ఆ తర్వాత పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే మాస్ మహారాజా రవితేజ ధమాకా మూవీలో ఛాన్స్ అందుకుని సత్తా చాటిందనే చెప్పాలి. తన అందం, అభినయంతో అందరినీ మెప్పించింది.
ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు.. వరుస అవకాశాలు అందుకుంది. తక్కువ టైమ్ లోనే పాపులర్ అయిపోయిన శ్రీలీల స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న ముద్దుగుమ్మ.. చిన్న గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ సినిమాలు, షూటింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది.
యంగ్ హీరో నితిన్ తో రాబిన్ హుడ్ లో, రవితేజతో కలిసి మాస్ జాతరలో యాక్ట్ చేస్తోంది శ్రీలీల. శివకార్తికేయన్ తో పరాశక్తి సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మ.. కోలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది. ఆమె చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టు కూడా ఉంది. కానీ ఆ సినిమా ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో ఇంకా తెలియదు. మరి శ్రీలీల అప్ కమింగ్ మూవీస్ ఎలాంటి హిట్స్ అవుతాయో వేచి చూడాలి.