Begin typing your search above and press return to search.

శ్రీలీల.. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందేనా?

రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప-2లో కిస్సిక్ సాంగ్ తో మెరిసి ఓ రేంజ్ లో సందడి చేసింది.

By:  Tupaki Desk   |   1 Feb 2025 3:15 AM GMT
శ్రీలీల.. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందేనా?
X

యంగ్ బ్యూటీ శ్రీలీల.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య వరుసగా ఫ్లాప్స్ వచ్చినా ఆమె ఇమేజ్ చెక్కు చెదరలేదనే చెప్పాలి. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప-2లో కిస్సిక్ సాంగ్ తో మెరిసి ఓ రేంజ్ లో సందడి చేసింది. అందరినీ వేరే లెవెల్ లో మెప్పించింది అమ్మడు.

అయితే పెళ్లి సందD మూవీలో టాలీవుడ్ లోకి వచ్చిన అమ్మడు.. తన అందం చందాలతో మేకర్స్ దృష్టిలో పడింది. మాస్ మహారాజా రవితేజతో ధమాకా మూవీ చేయగా.. రూ.100 కోట్ల హిట్ ఆమె సొంతమైంది. ఆ తర్వాత అవకాశాలు తన్నుకు వచ్చాయి. దీంతో యమా బిజీ గా గడిపింది. కానీ వరుస ఫ్లాప్స్ అందుకుంది.

రీసెంట్ గా కిస్సిక్ సాంగ్ తో మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అదే సమయంలో ఆమె చేతిలో ఇప్పుడు వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆమెనే హీరోయిన్ గా నటిస్తోంది. కానీ ఆ మూవీ షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు. రీసెంట్ గా స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

దాంతో పాటు నితిన్ రాబిన్ హుడ్ లో నటిస్తుండగా.. త్వరలో ఆ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో పాటు రవితేజతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న మాస్ జాతరలో హీరోయిన్ గా నటిస్తోంది.

అదే సమయంలో ఇప్పుడు మరో టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్న శ్రీ లీల.. కాల్షీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం లేదని అంటున్నారు. చూడ‌కుండా అడ్వాన్సులు అందుకుంటుందని చెబుతున్నారు. దీంతో డేట్స్ విషయంలో క్లాష్ వస్తుందని కామెంట్స్ పెడుతున్నారు.

దాని వల్ల మూవీస్ లేటు అవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు శ్రీలీల వల్ల మాస్ జాతర కూడా లేట్ అవుతుందని అంటున్నారు. ఇంకా చాలా కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉందని.. కానీ ఏప్రిల్ లో అందుబాటులోకి వస్తుందని చెబుతోందట. దీంతో మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకోవాలని మేకర్స్ యోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే కాల్ షీట్స్ విషయంలో జాగ్రత్త పడకపోతే మరిన్ని సినిమాలు చేజారిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి శ్రీలీల జాగ్రత్త పడాల్సిందే.