Begin typing your search above and press return to search.

ఓల్డ్ వింటేజ్ బ్యూటీలా గుంటూరు ఘాటు భామ‌!

న‌వ‌త‌రం భామ శ్రీలీల క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మాస్ కి మాస్ ..క్లాస్ కి క్లాస్ అన్ని సెక్ష‌న్ల‌కు రీచ్ అయిన అమ్మ‌డు శ్రీలీల‌.

By:  Tupaki Desk   |   3 Oct 2024 12:30 AM GMT
ఓల్డ్ వింటేజ్ బ్యూటీలా గుంటూరు ఘాటు భామ‌!
X

న‌వ‌త‌రం భామ శ్రీలీల క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మాస్ కి మాస్ ..క్లాస్ కి క్లాస్ అన్ని సెక్ష‌న్ల‌కు రీచ్ అయిన అమ్మ‌డు శ్రీలీల‌. అనతి కాలంలోనే స్టార్ లీగ్ లో స్థానం సంపాదించింది. ప్ర‌స్తుతం అమ్మ‌డు ఎంత బిజీగా ఉంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు సినిమాల‌తో పాటు తమిళ సినిమాల్లోనూ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఫేంలో ఉన్నంత కాల‌మే అవ‌కాశాలు అన్న సంగ‌తి అమ్మ‌డు తొంద‌ర‌గానే గుర్తించి ముందుకు సాగుతుంది.


సెకెండ్ లీడ్..ఫ‌స్ట్ లీడ్ అనే తార‌త‌మ్యం లేకుండా ఎలాంటి ఆఫ‌ర్ల‌కైనా ఎస్ చెబుతుంది. అలాగే సోష‌ల్ మీడియాలో అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల‌ను అల‌రిస్తుంది. ఫోటో షూట్ అయినా..వెకేష్ నుంచి రిలీజ్ చేసే పిక్స్ అయినా సంథింగ్ స్పెష‌ల్ గా ఉండేలా చూసు కుంటుంది. ఈ మ‌ధ్య కాలంలో శ్రీలీల త‌ల్లి కూడా ఎక్కువ‌గా వెంట ఉండి హైలైట్ అవుతున్నారు.


డాట‌ర్ తో పాటు మ‌మ్మీ కూడా ఈవెంట్ల‌లో పాల్గొన‌డంతో శ్రీలీల డిమాండ్ పెరిగింది? అన‌డానికి ఇదొక ప్రూప్ అనొచ్చు. హీరోయిన్లు బిజీగా ఉంటేనే వాళ్ల అమ్మ‌లు కూడా వెంట క‌నిపించ‌డం ప‌రిపాటే. తాజాగా శ్రీలీల కొత్త ఫోటో ఒక‌టి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో అమ్మ‌డు ఓల్డ్ వింటేజ్ భామ‌ని తల‌పించింది.

బ్లాక్ అండ్ వైట్ లో అల‌రించింది. మోడ్ర‌న్ దుస్తుల్లోనే పాత త‌రం హీరోయిన్ త‌ల‌పించింది. ప‌ర్పెక్ట్ ఔట్ ఫిట్ లో త‌ళుకులీనింది. జెబ్బ‌ల గౌను డిజైన్...మెడ చెట్టూ గులాబీ పూల‌తో డిజైన్ చేసి ఔట్ ఫిట్ లో శ్రీలీల ఎంతో అందంగా క‌నిపిస్తుంది. ఇందులో అమ్మ‌డు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ముస్తాబైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.