Begin typing your search above and press return to search.

ఉవ్వెత్తున లేచి, పడిన ఇద్దరు హీరోయిన్లు!

కాబట్టి సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో కథానాయికలు చాలా జాగ్రత్తగా, ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 11:30 AM GMT
ఉవ్వెత్తున లేచి, పడిన ఇద్దరు హీరోయిన్లు!
X

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం ఏమంత ఈజీ కాదు. వారానికో కొత్త భామ పరిచయమయ్యే టాలీవుడ్ లో పోటీని తట్టుకొని, నిలదొక్కుకోవడం అందరికీ కుదిరే పని కాదు. అందం అభినయంతో పాటుగా కూసింత అదృష్టం కూడా తోడైన అమ్మాయిలకే ఇక్కడ అవకాశాలు దక్కుతాయి. ఈ క్రమంలో మంచి హిట్లు పడితే కొన్నాళ్లపాటు హవా కొనసాగిస్తారు.. అదే ప్లాపులు పడితే మాత్రం అవకాశాలు సన్నగిల్లుతాయి. కాబట్టి సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో కథానాయికలు చాలా జాగ్రత్తగా, ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.


కన్నడ కస్తూరి కృతి శెట్టిని తీసుకుంటే, 'ఉప్పెన' చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఉప్పెనలా దూసుకొచ్చింది. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ కొట్టడంతో, క్రేజీ ఆఫర్స్ అమ్మడి తలుపుతట్టాయి. నాగచైతన్య, నాని, రామ్ పోతినేని, నితిన్.. వంటి టైర్-2 హీరోలందరికీ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని అనుకుందో ఏమో కానీ, వచ్చిన ప్రతీ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. 'శ్యామ్ సింగరాయ్' 'బంగార్రాజు' సినిమాలు కూడా హిట్టవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో ఇంక తిరుగుండదని అంతా భావించారు.

కానీ అప్పుడే కృతిశెట్టి ఫేట్ మారిపోయింది. బ్యాక్ టూ బ్యాక్ భారీ పరాజయాలు పలకరించాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వంటి సినిమాలు అమ్మడిని తీవ్రంగా నిరాశ పరిచాయి. చివరగా వచ్చిన 'మనమే' మూవీ కూడా ఆమె కెరీర్ కు ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. వరుస ప్లాప్స్ రావడంతో కృతికి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. దీంతో పక్క ఇండస్ట్రీల మీద ఫోకస్ పెట్టింది. తమిళ్ లో మూడు సినిమా ఛాన్సులు అందుకుంది.

కృతి శెట్టి మాదిరిగానే టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న మరో హీరోయిన్ శ్రీలీల. 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర భామ.. తన గ్లామర్ తో, డ్యాన్సులతో యువ హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత వచ్చిన 'ధమాకా' మంచి హిట్ కొట్టడంతో, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది.

శ్రీలీల కీలక పాత్ర పోషించిన 'భగవంత్ కేసరి' మూవీ మంచి విజయం సాధించింది, కానీ హీరోయిన్ గా నటించిన 'స్కంద: ఎటాకర్', 'ఆదికేశవ', 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మారాయి. ఇదే క్రమంలో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా హిట్టయినా, అది అమ్మడి కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ప్రస్తుతం నితిన్‌తో కలిసి 'రాబిన్‌హుడ్' సినిమాలో నటిస్తోంది. ఇది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', రవితేజ 'RT 75' ప్రాజెక్ట్స్ కూడా శ్రీలీల చేతిలో ఉన్నాయి. కాకపోతే ఇవి రెండూ ఇప్పుడప్పుడే ఆడియన్స్ ముందుకు వచ్చే సినిమాలు కాదు. అందుకే 'రాబిన్‌ హుడ్' మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది. దాదాపు పది నెలల గ్యాప్ తర్వాత ఆమె నుంచి రాబోతున్న చిత్రమిది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో మంచి హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలా జరగకపోతే అమ్మడి కెరీర్ కు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఆమె నుంచి భాగ్యశ్రీ బోర్సే రెండు ఆఫర్స్ వేగరేసుకుపోయిందనే టాక్ వినిపిస్తోంది. మరి శ్రీలీల మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.