బాలీవుడ్ వెళ్తే వీళ్లకి ఏమవుతుందో..!
అంతేకాదు ఇక్కడ గ్లామర్ షోకి కండీషన్స్ పెట్టిన భామలంతా కూడా బాలీవుడ్ వెళ్లగానే అందాలతో షేక్ చేస్తారు.
By: Tupaki Desk | 15 Feb 2025 4:09 PM GMTసౌత్ హీరోయిన్స్ కి ఇక్కడ ఎంత టాప్ ప్రియారిటీ ఇచ్చి స్టార్ రేంజ్ ఇచ్చినా కూడా ఒక్క బాలీవుడ్ ఆఫర్ వస్తే చాలు ఎగిరిగంతేస్తుంటారు. బాలీవుడ్ అంటే ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఎన్ని ప్రాంతీయ సినిమాలు చేసినా కూడా బాలీవుడ్ ఆఫర్ రాగానే ఆ హీరోయిన్స్ లో ఎంతోకొంత మార్పు కనిపిస్తుంది. సౌత్ సినిమాల్లో గ్లామర్ షోకి మొహమాట పడిన ఎంతోమంది బీ టౌన్ నీళ్లు పడగానే స్కిన్ షో మొదలు పెడతారు. అంతేకాదు ఇక్కడ గ్లామర్ షోకి కండీషన్స్ పెట్టిన భామలంతా కూడా బాలీవుడ్ వెళ్లగానే అందాలతో షేక్ చేస్తారు.
మరి ఇక్కడ అక్కడ తేడా ఏంటన్నది తెలియదు కానీ హీరోయిన్స్ ఈ ఛేంజ్ ఓవర్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సౌత్ లో ఎన్నో సినిమాలు చేసిన కీర్తి సురేష్ బాలీవుడ్ లో చేసిన తొలి సినిమా బేబీ జాన్ తో అందాలతో బ్లాస్ట్ చేసింది. అమ్మడు ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి ఆమె సౌత్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇప్పుడు అదే దారిలో శ్రీలీల కూడా తన గ్లామర్ తో షా ఇవ్వబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ ఛాన్స్ కూడా అందుకుంది.
కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీల కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో సింగర్ గా కార్తీక్ ఆర్యన్ రఫ్ లుక్ తో కనిపించగా అతని ప్రేయసిగా శ్రీలీల అదరగొట్టేసింది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జోడీ రొమాన్స్ అదరగొట్టేసిందని అనిపిస్తుంది. టీజర్ లో చూపించలేదు కానీ సినిమాలో అమ్మడు లిప్ లాక్ కానిచ్చినట్టే ఉంది.
బాలీవుడ్ వెళ్లడం ఆలస్యం మొదటి సినిమాతోనే శ్రీలీల తన బోర్డర్స్ అన్ని చెరిపేసి సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది. హీరోయిన్ గా ఈమధ్యనే కెరీర్ మొదలు పెట్టిన శ్రీలీల ఇప్పుడే లిప్ లాక్స్ చేస్తే ఎలా అంటున్న వారు ఉన్నారు. ఐతే బాలీవుడ్ లో అది కూడా ఒక క్రేజీ సినిమాలో సీన్ డిమాండ్ చేస్తే అందులో తప్పేమి లేదని చెప్పొచ్చు. ఇక రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే ఆషికి ఫ్రాంచైజ్ లా అనిపిస్తుంది. అదే ఐతే మాత్రం శ్రీలీల అడుగు పెట్టడమే ఒక సూపర్ హిట్ సినిమా ఫ్రాంచైజ్ లో భాగం అవుతుందని చెప్పొచ్చు.