కిస్ కిసిక్కా.. చిన్న బిట్టుతోనే వైబ్ ఇచ్చారుగా...
ఇక చిన్న ప్రోమోలో చూపిన విజువల్స్ గ్రాండ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 23 Nov 2024 5:12 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల గ్లామర్ అండ్ టాలెంట్‌తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు రాబోతున్నారు. సినిమాలోని స్పెషల్ కిస్సిక్ సాంగ్ ఇప్పటికే అందరిలో భారీ అంచనాలు సృష్టించింది. ఇక లేటెస్ట్ గా ఈ స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల కాగా, ఒక్క చిన్న బిట్తోనే ఓ రేంజ్ వైబ్ క్రియేట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ సాంగ్‌కు అసలైన బజ్ ఇవ్వగా, ఫ్యాన్స్‌లో మరింత ఎగ్జయిట్మెంట్ పెరిగింది.
ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ అటిట్యూడ్, శ్రీలీల ఎనర్జీ మరో లెవెల్లో కనిపించనున్నట్లు పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇక చిన్న ప్రోమోలో చూపిన విజువల్స్ గ్రాండ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీ స్వాగ్, శ్రీలీల స్టెప్పులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయని మేకర్స్ హింట్ ఇచ్చేశారు. "ఊ అంటావా మావ" సాంగ్‌తో పుష్ప మొదటి భాగంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఊహించని రెస్పాన్స్ దక్కింది, ఇప్పుడు కిస్సిక్ సాంగ్ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
స్పెషల్ సాంగ్ కు సంబంధించిన న్యూ పోస్టర్‌కి కూడా సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లలో బన్నీ, శ్రీలీల అద్భుతమైన ఆవుట్ఫిట్స్లో కనిపించగా, వాళ్ల కెమిస్ట్రీ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. డ్యాన్స్ ఫ్లోర్ మీద బన్నీ స్టెప్పుల దుమ్ము రేపుతుందనడానికి ఈ ప్రోమోలో క్లారిటీ వచ్చేసింది. సాంగ్ మొత్తం చూస్తే మరింత థ్రిల్ ఉండబోతుందని ఆడియన్స్ భావిస్తున్నారు.
మేకర్స్ ఈ సాంగ్ కోసం ఖర్చుకు వెనకాడకుండా భారీ సెట్స్ వేసి చిత్రీకరించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సాంగ్ ఆడియన్స్‌ను థియేటర్‌కి రప్పించే కీలక ఎలిమెంట్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. మరోవైపు రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్ వంటి నటీనటులు ఉన్న ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేస్తున్న సంగీతం కీలక ఆకర్షణ.
ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 7:02కి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2: ది రూల్ గురించి ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచుతుందని అంతా ఆశిస్తున్నారు. మొత్తానికి, ఈ పాట థియేటర్లలో పండగ వాతావరణం తెస్తుందని ఎటువంటి సందేహం లేదు.