Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మత్తు కళ్లతో కవ్విస్తున్న శ్రీలీల

తాజాగా మరో అందమైన ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:30 PM GMT
పిక్ టాక్ : మత్తు కళ్లతో కవ్విస్తున్న శ్రీలీల
X

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఆ సినిమా నిరాశ పరచినా అనూహ్యంగా ఈ అమ్మడికి స్టార్‌ డం దక్కింది. తెలుగులో ప్రస్తుతం టాప్ స్టార్‌ హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా శ్రీలీల దూసుకు పోతుంది. గత ఏడాది ఈ అమ్మడి నుంచి వచ్చిన సినిమాల్లో గుంటూరు కారం నిరాశ పరిచింది. ఈ ఏడాది పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు ఈమె ఫోటోలను తెగ షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా మరో అందమైన ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.


ఈసారి శ్రీలీల డెనిమ్‌ షార్ట్‌ ధరించి మత్తు కళ్లతో కవ్వించే విధంగా చూస్తోంది. సింపుల్‌ అండ్‌ క్యూట్‌ లుక్‌లోనూ శ్రీలీల చూపు తిప్పుకోనివ్వడం లేదు. సాధారణంగా హీరోయిన్స్ మేకప్‌ లేకుండా చూడలేం. కానీ శ్రీలీల ఇలా కూడా చాలా అందంగా ఉందని, హెయిర్ డ్రెస్ చేయకున్నా చాలా అందంగా ఉంది అంటూ ఫ్యాన్స్ మరోసారి ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ స్థాయి అందం ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో కేవలం శ్రీలీలకే సాధ్యం అంటూ ఆమె ఫ్యాన్స్‌లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు ఈ అమ్మడి అందాల ఆరబోతకు మరిన్ని పెద్ద సినిమాల్లో హీరోయిన్స్‌ ఛాన్స్‌ దక్కవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు.


ప్రస్తుతం ఈమె సినిమాల జాబితా తీస్తే చాలా పెద్దగానే ఉంది. నితిన్‌తో నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు నవీన్ పొలిశెట్టి సినిమాలో నటిస్తోంది. ఇక అత్యంత ముఖ్యంగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. ఈమధ్య కాలంలో విజయ్‌ దేవరకొండతో నటించేందుకు పలువురు యంగ్‌ హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ అవకాశం శ్రీలీలకు దక్కింది. ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో కొంత సమయం కనిపించబోతుందని తెలుస్తోంది. అయినా శ్రీలీల మెయిన్‌ లీడ్‌గా సినిమాలో కనిపించబోతుందని సమాచారం అందుతోంది.

ఇంకా శ్రీలీల నటిస్తున్న సినిమాలు, నటించబోతున్న సినిమాలు, కమిట్‌ అయిన సినిమాలు, చర్చలు జరుగుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఈ ఏడాది కనీసం అయిదు లేదా ఆరు వస్తాయని అంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో వారి కాంబోలో మరిన్ని సినిమాలను శ్రీలీల చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాల్లో నటిస్తున్న కారణంగా శ్రీలీల పారితోషికం సైతం భారీగానే డిమాండ్‌ చేస్తుంది. కిస్సిక్‌ సాంగ్ కోసం దాదాపు రెండు కోట్ల పారితోషికంను శ్రీలీల అందుకుంది. హీరోయిన్‌గా నటిస్తే అంతకు మించి పారితోషికం అందుకుంటూ ఉందట.