Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శ్రీ‌లీల అందం హిందోళం

తాజాగా శ్రీ‌లీల ప‌ర్పుల్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్ లో ఫోజులిచ్చిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 3:00 AM GMT
ఫోటో స్టోరి: శ్రీ‌లీల అందం హిందోళం
X

త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది శ్రీ‌లీల‌. ఈ తెలుగ‌మ్మాయి కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో ఉంది. పెద్ద హీరోల‌తో సినిమాలు ఫ్లాపులైనా కానీ, శ్రీ‌లీల ప్ర‌తిభ‌ను గుర్తించి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వ‌రుస‌గా సినిమాల్లో అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాల్లోను ఈ బ్యూటీ ప్ర‌త్యేకించి ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది. వారి కోసం శ్రీ‌లీల హాట్ ఫోటోషూట్ ల‌ను షేర్ చేస్తుంది. తాజాగా శ్రీ‌లీల ప‌ర్పుల్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్ లో ఫోజులిచ్చిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


శ్రీ‌లీల కెరీర్ జ‌ర్నీ ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం యూత్ స్టార్ నితిన్ స‌ర‌స‌న `రాబిన్ హుడ్` చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత కూడా అవ‌కాశాలున్నాయి. దిగ్గజ దర్శకుడు డేవిడ్ దావ‌న్‌తో శ్రీలీల ఓ హిందీ సినిమలో న‌టించాల్సి ఉంది. కానీ రక‌ర‌కాల కార‌ణాల‌తో ఇది కుద‌ర‌లేదు. మేకర్స్ శ్రీలీలకు మొదట ఈ చిత్రాన్ని ఆఫర్ చేశారు. కానీ త‌న‌కు డేట్స్ లేకపోవడంతో సినిమా నుండి తప్పుకుంది.


మ‌హేష్ - ర‌వితేజ లాంటి పెద్ద హీరోల‌తో ఆఫ‌ర్లు త‌న‌కు పెద్ద విజ‌యాల‌ను అందిస్తాయ‌ని ఆశించింది. కానీ అవ‌న్నీ ఫ్లాపుల‌య్యాయి. ఇప్పుడు నితిన్ తో తాజా చిత్రాన్ని శ్రీ‌లీల‌ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తోంది. నితిన్ ఎన‌ర్జీకి త‌గ్గ‌ట్టుగా శ్రీ‌లీల డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకోగ‌ల‌దు.