Begin typing your search above and press return to search.

కిసిక్ బ్యూటీ ర్యాండం క్లిక్స్..!

ఏదో ఫోటో షూట్ చేయాలి.. అటెన్షన్ రాబట్టాలన్న ఆలోచన ఏమి లేకుండా ర్యాండం లుక్స్ తోనే రచ్చ చేస్తుంది అమ్మడు.

By:  Tupaki Desk   |   25 Jan 2025 4:16 PM GMT
కిసిక్ బ్యూటీ ర్యాండం క్లిక్స్..!
X

క్యూట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన శ్రీలీల చేస్తున్న సినిమాలు వాటి ఫలితాలు ఎలా ఉన్నా కూడా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది. ముఖ్యంగా అమ్మడు చేస్తున్న సినిమాల కన్నా వాటికి ఏమాత్రం తగ్గకుండా చేస్తున్న ఫోటో షూట్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఏదో ఫోటో షూట్ చేయాలి.. అటెన్షన్ రాబట్టాలన్న ఆలోచన ఏమి లేకుండా ర్యాండం లుక్స్ తోనే రచ్చ చేస్తుంది అమ్మడు.


ఇక తను చేసే ర్యాండం థింగ్స్ తనకు నవ్వు తెప్పించేలా చేస్తాయని కొటేషన్ పెట్టి తన క్లిక్స్ ని షేర్ చేసింది అమ్మడు. ఈమధ్యనే పుష్ప 2 సినిమాలో కిసిక్ సాంగ్ తో అదరగొట్టిన శ్రీలీల తన లేటేస్ట్ క్లిక్స్ తో కూడా ఆ కిసిక్ సాంగ్ ఫీల్ కలిగించేలా చేసింది.


శ్రీలీల ఏం చేసినా సరే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలీల లేటెస్ట్ క్లిక్స్ కూడా ఆమె ఫాలోవర్స్ కి మంచి జోష్ అందిస్తున్నాయి. ఒక బిజీ కెఫేలో వాటర్ మిలెన్ జ్యూస్ ని సిప్ చేస్తూ శ్రీలీల దిగిన ఫోటో చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించేల ఉందంటే నమ్మాల్సిందే. తెర మీద తన అల్లరితో మెప్పిస్తూ ఆఫ్ స్క్రీన్ ఇలా తన ఫోటో షూట్స్ తో డిస్ట్రబ్ చేస్తూ శ్రీలీల చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.


ఇక అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మాస్ రాజా రవితేజతో మాస్ జాతర సినిమా చేస్తుంది ఈ అమ్మడు. ఆ సినిమా తో పాటు పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్ మీద ఉంది. ఈమధ్యనే శివ కార్తికేయన్ సినిమాలో ఛాన్స్ అందుకుని కోలీవుడ్ లోకి అడుగు పెట్టేస్తుంది అమ్మడు. తెలుగులో ఎంట్రీతోనే అదరగొట్టి మధ్యలో కాస్త డౌన్ అయిన అమ్మడి గ్రాఫ్ పెంచేందుకు అన్ని విధాలుగా ట్రై చేస్తుంది.


అంతేకాదు కొన్ని ప్రాజెక్ట్ ల విషయంలో హీరోయిన్ గా శ్రీలీల అని చెబుతూ తీరా సెట్స్ మీదకు వెళ్లే సరికి ఆమె ప్లేస్ లో మరో భామని తీసుకుంటున్నారు. ఈ కమ్యునికేషన్ గ్యాప్ ఎవరి వల్ల వస్తుంది అన్నది క్లారిటీ తీసుకుంటే శ్రీలీల కెరీర్ ఇంకా దూకుడు చూపించే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.