Begin typing your search above and press return to search.

అమ్మ‌కు శ్రీలీల అమ్ములా!

తెలుగు హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టార్ లీగ్ లో చేరిన‌ నెటి జ‌న‌రేష‌న్ తొలి తెలుగు హీరోయిన్.

By:  Tupaki Desk   |   6 Dec 2024 12:30 PM GMT
అమ్మ‌కు శ్రీలీల అమ్ములా!
X

తెలుగు హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టార్ లీగ్ లో చేరిన‌ నెటి జ‌న‌రేష‌న్ తొలి తెలుగు హీరోయిన్. అమ్మ‌డు చాలా వేగంగా స్టార్ హీరోల చిత్రాలకు ప్ర‌మోట్ అయింది. సాధార‌ణంగా తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌రు? అనే విమ‌ర్శ చాలా కాలంగా ఉంది. దాన్ని శ్రీలీల కాస్త బ్రేక్ చేసిన‌ట్లే క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి కెరీర్ కి తిరుగు లేదు. శ్రీలీల చ‌లాకీ త‌నం....ట్యాలెంట్ తో ఇండ‌స్ట్రీలో నెట్టుకొచ్చేస్తుంది.

`పుష్ప‌-2`లో ఐటం పాట‌తో పాన్ ఇండియాలోనూ సంచ‌ల‌నం అయింది. ఈ పాట అమ్మ‌డిని పాన్ ఇండియాలోనే ఎన‌లేని గుర్తింపును తీసుకొచ్చింది. మొద‌టి భాగంలో స‌మంత ఊపేస్తే రెండ‌వ భాగంలో శ్రీలీల ఊపేసింది. ఇక‌పై బాలీవుడ్ లో అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఓ సినిమాలో ఛాన్స్ వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారింది. అయినా శ్రీలీల చ‌లాకీత‌నంతో మ‌రెన్నో అవ‌కాశాల‌కు ఛాన్స్ ఉంది.

ఇక అమ్మ‌డు ఇంట్లో కూడా ఎంతో చలాకీగా ఉంటుంది. అమ్మ‌ను ఆట ప‌ట్టించ‌డంలో ముందుంటుంది. అమ్మ‌కు శ్రీలీల అంటే మ‌హా గారం లా ఉంది. శ్రీలీల‌ను వాళ్ల‌మ్మ ముద్దుగా అమ్ములు అని పిలుస్తుంది. సాధార‌ణంగా ఇలాంటి పిలుపులు ప‌ల్లెటూళ్ల‌లో వినిపిస్తుంటాయి. కానీ సిటీ క‌ల్చ‌ర్ లో పెరిగిన అమ్మాయిని ఇలా పిల‌డంతో? వాళ్లెంత డౌన్ టౌ ఎర్త్ అన్న‌ది అద్దం ప‌డుతుంది. త‌ల్లీ-కూతురు డాక్ట‌ర్లు. బెంగుళూరులో సొంత ఆసుప‌త్రులున్నాయి.

శ్రీలీల న‌టి కాక‌పోయి ఉంటే అమ్మ‌లా డాక్ట‌ర్ అయ్యేది. ఇప్ప‌టికే ఆ కోర్సు కూడా పూర్తి చేసింది. కానీ త‌ల్లి కుమార్తెను హీరోయిన్ చేయాల‌ని చిన్న‌నాటి ప్లాన్ చేసి న‌ట‌న‌వైపు అడుగులు ప‌డ‌లా చూసారు. అందుకే శ్రీలీల అంత గొప్ప డాన్స‌ర్ అయింది. న‌టిగానూ ఆమెకు తిరుగు లేదు.