ఇకపై నో అంటే నో!
పుష్ప 2 లో ఐటెం సాంగ్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో చేయించాలని దర్శకుడు సుకుమార్ అనుకున్నాడు. అల్లు అర్జున్ సైతం బాలీవుడ్ హీరోయిన్ అయితేనే బాగుంటుంది అనుకున్నాడు.
By: Tupaki Desk | 7 Dec 2024 5:30 PM GMTపుష్ప 2 లో ఐటెం సాంగ్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో చేయించాలని దర్శకుడు సుకుమార్ అనుకున్నాడు. అల్లు అర్జున్ సైతం బాలీవుడ్ హీరోయిన్ అయితేనే బాగుంటుంది అనుకున్నాడు. అందుకే పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించిన తర్వాత సాహో సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన శ్రద్దా కపూర్‌ను అనుకున్నారు. ఆమెను సంప్రదించగా ఓకే చెప్పింది. అయితే పారితోషికం విషయంలో ఇబ్బంది ఎదురైందట. సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆమె పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం ఏకంగా రూ.8 కోట్లు డిమాండ్ చేసిందట. దాంతో నిర్మాతలు అమ్మ బాబోయ్ మా వల్ల కాదు అంటూ ఆమెతో చర్చలు ఆపేశారు.
సుకుమార్‌కి సైతం అంత పారితోషికం ఇచ్చి శ్రద్ద కపూర్‌తో ఆ పాట చేయించాలని లేదట. అందుకే అల్లు అర్జున్ సూచనతో శ్రీలీలను ఎంపిక చేసి ఉంటారు అనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా శ్రీలీల ఐటెం సాంగ్స్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్‌కి నో చెప్పింది. అంతే కాకుండా చిరంజీవి సినిమా విశ్వంభరలోనూ శ్రీలీల ప్రత్యేక పాటలో నటించేందుకు సంప్రదిస్తే నో చెప్పిందట. అందుకే పుష్ప 2 లో ఆమె నటించేందుకు ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ చేయడంతో పాటు, వారం రోజుల లోపు డేట్లు ఇస్తేనే భారీ పారితోషికం అంటూ మైత్రి వారు ఆఫర్ ఇచ్చారు. అల్లు అర్జున్‌తో డాన్స్ చేయాలనే కోరిక శ్రీలీలకు చాలా కాలంగా ఉంది. ఆయనతో సినిమాలో నటించే అవకాశం వస్తుందో లేదో అందుకే కిస్సిక్ సాంగ్ లో చేసేద్దాం అని శ్రీలీల భావించిందట. అందుకే శ్రీలీల కిస్సిక్ సాంగ్‌లో నటించి మెప్పించింది. పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేయాలని ఆమెను అడిగిన వెంటనే ఆలోచించకుండా అల్లు అర్జున్ కోసం, ఆయనతో డాన్స్ చేయడం కోసం, పుష్ప కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఓకే చెప్పిందట.
ఇకపై శ్రీలీల ఐటెం సాంగ్స్‌కి నో చెప్పదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ కోసం కిస్సిక్ చేశాను తప్ప ప్రత్యేకంగా తాను ఐటెం సాంగ్ చేయాలని అనుకోలేదు. ఇకపై ఎవరైనా తనను ఐటెం సాంగ్ కోసం సంప్రదిస్తే కచ్చితంగా నో అని చెబుతాను అంది. నో అంటే నో అని చెబుతాను అంటూ గట్టిగా చెప్పిన శ్రీలీల ప్రస్తుతం నితిన్‌తో కలిసి రాబిన్ హుడ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఆ సినిమాపై శ్రీలీల చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.