శ్రీలీల ఊర మాస్..వొంగోబెట్టి వేస్తుంది!
టాలీవుడ్ డాల్ శ్రీలీల ఆన్ స్క్రీన్ అప్పిరియన్సే కాదు ఆఫ్ స్క్రీన్ అప్పిరియన్స్ అంతే అట్రాక్టివ్ గా ఉంటుంది.
By: Tupaki Desk | 25 March 2025 2:35 PM ISTటాలీవుడ్ డాల్ శ్రీలీల ఆన్ స్క్రీన్ అప్పిరియన్సే కాదు ఆఫ్ స్క్రీన్ అప్పిరియన్స్ అంతే అట్రాక్టివ్ గా ఉంటుంది. అమ్మడి చలాకీతనానికే బోలెడంత ఫాలోయింగ్ ఉంది. రష్మికా మందన్నా తర్వాత శ్రీలీల ఎనర్జీ, యాక్టివ్ నెస్ గురించే యువతలో అనునిత్యం చర్చ. శ్రీలీల తెలుగు అమ్మాయి కావడం అమ్మడికి మరింత కలిసొస్తుంది. తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా అప్పుడప్పుడు ఊర మాస్ పంచ్ లు కూడా వదలుతుంటుంది.
తాజాగా అమ్మడు మరోసారి అలాంటి పంచ్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఓ ఈవెంట్ లో చదువుకునే సమయంలో ఎప్పుడైనా చిట్టీలు పెట్టారా? అంటే అలాంటివి చేస్తే అమ్మ వొంగో బెట్టి వాయించేస్తుందని కిలా కిలా నవ్వేసింది. దీంతో స్టేజ్ కిందనున్న కుర్రకారు కూడా ఒక్కసారిగా కిర్రెక్కి బోయారు. ఒక్కసారిగా ఈలలు ...కేకలు వేస్తూ మరింత జోష్ నింపారు. ఇలాంటి చలోక్తులు శ్రీలీలకు బాగా అలవాటైన పనే. ఎంతైనా తెలుగు పిల్ల కదా.
శ్రీలీల మామ్ తో ఉండే విధానం గురించి చెప్పాల్సిన పనిలేదు. కూతురంటే అమితమైన గారం ఆ తల్లికి. శ్రీలీల హీరోయిన్ అయిన తర్వాత మామ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కుమార్తెతో పాటు తల్లి కూడా అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లకు హాజరవుతున్నారు. శ్రీలీలను హీరోయిన్ గా చూడాలన్నది మామ్ కల. అందుకే చిన్ననాటి నుంచి డాన్సింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.
చదువును కూడా ఏ మాత్రం అశ్రద్ద చేయలేదు. తల్లి పెద్ద డాక్టర్ కావడంతో కుమార్తెను కూడా డాక్టర్ చదవించింది. బెంగుళూరులో సొంత ఆసుపత్రులున్నాయి. కన్నడ సెలబ్రిటీలు ఎక్కువగా అదే ఆసుపత్రికి వెళ్తుంటారు. ఆ రకంగా కన్నడ నాట బాగా ఫేమస్ అయ్యారు.