వీడియో : హీరోయిన్ రూమ్‌లో నితిన్..!
తాజాగా నితిన్‌పై శ్రీలీల ఒక ఫ్రాంక్ వీడియో చేసింది. హీరో గారి రూం అని రాసి ఉన్న రూంలో నితిన్ ఉన్నాడు. హీరో అని రాసి ఉన్న దాన్ని హీరోయిన్ అంటూ మార్చింది.
By: Tupaki Desk | 7 Dec 2024 12:24 PM GMTయంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అందులో మొదటగా రాబిన్ హుడ్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట రష్మిక మందన్నను ఎంపిక చేయడం జరిగింది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కాంబోలో గతంలో వచ్చిన భీష్మ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరోసారి వీరి కాంబో సెట్ అయ్యింది. కానీ పుష్ప 2 సినిమా కోసం రష్మిక ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది అంటూ దర్శకుడు వెంకీ కుడుముల ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.
రష్మిక తప్పుకోవడంతో ఆ పాత్రను లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల చేసింది. నితిన్‌కు జోడీగా రాబిన్‌హుడ్ సినిమాలో ముద్దుగుమ్మ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఒక పాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నితిన్‌తో తన యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి శ్రీలీల మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ సమయంలో రాబిన్ హుడ్‌ను పూర్తి చేసి ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంది.
తాజాగా నితిన్‌పై శ్రీలీల ఒక ఫ్రాంక్ వీడియో చేసింది. హీరో గారి రూం అని రాసి ఉన్న రూంలో నితిన్ ఉన్నాడు. హీరో అని రాసి ఉన్న దాన్ని హీరోయిన్ అంటూ మార్చింది. తన రూంలో ఏం చేస్తున్నారు అంటూ లోనికి వెళ్లి నితిన్‌ను ఫ్రాంక్ చేసేందుకు ప్రయత్నించింది. నితిన్ హీరో రూం కదా అంటూ బయటకు వచ్చి హీరోయిన్ అని రాసి ఉండటంను చూసి నవ్వేశాడు. శ్రీలీల చేసిన ఫ్రాంక్ ను ఆయన లైట్ తీసుకుని లోనికి వెళ్లినట్లుగా వీడియో ఉంది. ఈ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ వారు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.
పుష్ప 2 సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్న సినిమా రాబిన్ హుడ్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి ఉన్న రష్మిక తప్పుకున్నా చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. డిసెంబర్ 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై నితిన్‌తో పాటు మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. పుష్ప 2 జోరు అప్పటి వరకు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక సినిమాకు భారీగా థియేటర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి.