పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. శ్రీలీల, రష్మిక ఏమన్నారంటే..
ఇక సినిమాలో తన పాత్ర గురించి శ్రీలీల మాట్లాడుతూ, "ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది.
By: Tupaki Desk | 3 Dec 2024 4:07 AM GMTపుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నటి శ్రీలీల, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వారి అందంతో మాటలతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఈ ఇద్దరి మాటలు సినిమా మీదున్న అంచనాలను మరింత పెంచాయి. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక శ్రీలీల, రష్మికలపై కూడా ప్రముఖ దర్శకులు ప్రశంసలు కురిపించారు.
ఇక సినిమాలో తన పాత్ర గురించి శ్రీలీల మాట్లాడుతూ, "ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. పుష్పలో అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దర్శకుడు సుకుమార్ గారికి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సాధారణంగా, ఒక సినిమాలో ఇద్దరు ముఖ్యపాత్రధారులు ఉంటే, వారిద్దరూ సెట్స్‌లో తలపడతారని అనుకుంటారు. కానీ అల్లు అర్జున్ గారు ఎంతో సహృదయంతో, అందరితో మంచి బాండింగ్‌ను కొనసాగించారు. ఇది చూసి సెట్‌లో ఉన్నవారందరూ సంతోషించేవారు.. అని ఆమె తన వివరణ ఇచ్చారు.
అలాగే, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీతరచయిత చంద్రబోస్, మైత్రి మూవీ మేకర్స్, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా ఎంత కష్టంతో రూపొందిందో ప్రేక్షకులకు తప్పకుండా అర్థమవుతుంది. అందరి ప్రయత్నాల వల్లే ఈ సినిమా విజయవంతమవుతుందని నమ్ముతున్నాను," అంటూ ఆమె మాటలు ముగించారు.
ఇక రష్మిక మందన్న మాట్లాడుతూ, "అందరూ ఎలా ఉన్నారు? పుష్ప 2 చిత్రబృందంతో కలిసి పనిచేయడం నా కెరీర్‌లో గొప్ప అనుభవం. పుష్ప 1 షూటింగ్ సమయంలోనే పుష్ప 2పై ఎంత కష్టపడాలి అనే ఆలోచన వచ్చింది. సుకుమార్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నా పాత్రకు ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మీరు థియేటర్‌లో చూస్తారు," అని చెప్పారు.
సుకుమార్ గారి గురించి చెబుతూ, "పుష్ప 1 సమయంలో ఆయన చాలా సైలెంట్‌గా ఉండేవారు. కానీ పుష్ప 2 సమయంలో ఆయనతో చాలా సరదాగా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఆయన మంచి దర్శకులు. మరోసారి కూడా ఆయనతో వర్క్ చేయాలని ఉంది. పుష్ప ప్రాజెక్ట్ నాకు ఒక స్పెషల్ అనుభూతి. ఇక పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాను," అని రష్మిక వెల్లడించారు.
అలాగే తనతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లపై ప్రత్యేకంగా మాట్లాడారు. " ఇక ఎంతగానో హార్డ్ వర్క్ చేసిన డివోపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం చిత్రానికి ప్రధాన బలం. సినిమాలో స్టిలీల స్పెషల్ డాన్స్ నాకు ఎంతో ఇష్టమైంది," అన్నారు. చివరిగా, అల్లు అర్జున్ గురించి చెబుతూ, "మీరు నిజంగా సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను దాటించారు. మీతో కలిసి నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ ఫైర్ కావాలని కోరుకుంటున్నాను," అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.