నచ్చితే మెచ్చుతా...పోటీ మాత్రం పడను!
తాజాగా ఈ విషయంపై శ్రీలీల కూడా తన అభిప్రాయాన్ని పంచుకుంది. 'చిత్ర పరిశ్రమ అన్నది ఓ పుష్పక విమానం. ప్రతీ నటికి వాళ్ల ప్రతిభకు తగ్గట్లుగా తమకంటూ ఓ స్థానం ఉంటుంది.
By: Tupaki Desk | 20 Sep 2024 9:30 PM GMTఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ ఉంటుందంటారంతా. ఒకరికి రావాల్సిన అవకాశం మరొకరికి వెళ్లినా? అని వార్య కారణాలతో ప్రాజెక్ట్ నుంచి ముందు ఎంపిక చేసిన భామని తప్పించినా? అందుకు పోటీ కారణంగా హైలైట్ అవుతుంటుంది. ఫాంలో ఉన్న భామల మధ్య ఈ పోటీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ పోటీ విషయాన్ని హీరోయిన్ల దృష్టికి తీసుకెళ్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తుంటారు.
తాజాగా ఈ విషయంపై శ్రీలీల కూడా తన అభిప్రాయాన్ని పంచుకుంది. 'చిత్ర పరిశ్రమ అన్నది ఓ పుష్పక విమానం. ప్రతీ నటికి వాళ్ల ప్రతిభకు తగ్గట్లుగా తమకంటూ ఓ స్థానం ఉంటుంది. అందుకే ఇక్కడ పోటీ ఉంటుందని నేనెప్పుడు భావించను. ప్రతీ సినిమా విషయంలో నా నటననకు మెరుగు పరుచుకుంటూ ముందుకెళ్తా. తోటి నాయికల ఎవరి నటన అయినా మెచ్చుకోవడం నాకున్న గొప్ప అలవాటు.
వాళ్లతో పోటీ పడుతున్నాని ఎప్పుడూ అనుకోను. ఒక అవకాశం చేజారినా అందులో మరో నాయిక నటించినా? నేను నటించాల్సిన సినిమా అనే భావన రానివ్వను. నా మనసు...మైండ్ ఎప్పుడూ ప్రెష్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను ఎవర్నీ పోటీగా భావించను. నేను ఎవరికీ పోటీ కాను అన్నదే నా సిద్దాంతం' అంది.
ప్రస్తుతం శ్రీలీల నటిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' లో నటిస్తోంది. అలాగే నితిన్ కిజోడీగా 'రాబిన్ హుడ్' లో నటిస్తోంది. ఈ రెండు గాక మాస్ రాజా రవితేజతో ఓ సినిమాకి ఎంపికైంది. ఇది రవితేజ ల్యాండ్ మార్క్ చిత్రం. ఆ సినిమా నెంబర్ 75.