శ్రీలీల సాంగ్ రీక్రియేషన్.. క్యూట్ వీడియో చూశారా?
ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని బిజీ బిజీగా గడిపేసింది. గతంలో ఒకేసారి ఆమె చేతిలో పది ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
By: Tupaki Desk | 26 Feb 2025 12:01 PM GMTయంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. పెళ్లి సందడి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ధమాకా మూవీతో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చేసింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని బిజీ బిజీగా గడిపేసింది. గతంలో ఒకేసారి ఆమె చేతిలో పది ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
అయితే ఫుల్ జోష్ లో ఉన్న శ్రీలీలకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. కానీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. 2023 దసరాకు వచ్చిన భగవంత్ కేసరి మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసింది అమ్మడు. ఆ తర్వాత గుంటూరు కారం మూవీతో హిట్ కొట్టకపోయినా.. కుర్చీ మడత పెడితే పాటతో వేరే లెవెల్ లో అలరించిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
ఇప్పుడు రాబిన్ హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానుంది శ్రీలీల. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్ట్ షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.
అదే సమయంలో మేకర్స్... క్రేజీ అప్డేట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్.. క్యూట్ వీడియో పోస్ట్ చేసింది. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రాబిన్ హుడ్ లోని సెకెండ్ సింగిల్ వేరేవర్ యూగోను రీక్రియేట్ చేసింది శ్రీలీల. చేతిలో కేక్ పట్టుకుని ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెఎషన్స్ అదిరిపోయాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీలీల వీడియో వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వావ్ సూపర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అని చెబుతున్నారు. లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ తో మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.
ఇక శ్రీలీల కొత్త సినిమాల విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ హోల్డ్ లో ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆషికి -3 మూవీలో శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. సూపర్ రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై అంచనాలు పెంచుతుంది.. మరి శ్రీలీల.. తన కొత్త చిత్రాలతో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.