Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయ్ ముగింపు రాక్ సాలిడ్ గా!

2024 ముగింపు కొచ్చేసాం. ఇంకొన్ని రోజుల్లో కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్ప‌బోతున్నాం.

By:  Tupaki Desk   |   7 Dec 2024 12:30 PM GMT
తెలుగమ్మాయ్ ముగింపు రాక్ సాలిడ్ గా!
X

2024 ముగింపు కొచ్చేసాం. ఇంకొన్ని రోజుల్లో కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్ప‌బోతున్నాం. అంతా సెల‌బ్రేష‌న్ల‌కు రెడీ అవుతున్నారు. దేశాలు...ఖండాలు దాటి పోవ‌డానికి సంసిద్దంగా ఉన్నారు. ఇక ఈ ఏడాదిని `పుష్ప‌-2` భారీ విజ‌యంతో టాలీవుడ్ గ్రాండ్ గా ముగిస్తుంది. మ‌రి తెలుగ‌మ్మాయి శ్రీలీల ఎలా ముగించ‌బోతుంది? అంటే అమ్మ‌డు రాక్ సాలిడ్ గా ముగింపు ప‌లుకుతుంది. ఈ ఏడాది శ్రీలీల ఆరంభంలో `గుంటూరు కారం`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది.

అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి జోడీగా న‌టించి ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. గ‌త ఏడాది `భ‌గవంత్ కేస‌రి`తో మంచి విజ‌యం ఖాతాలో వేసుకున్నా `స్కంద‌`, `ఆదికేశ‌వ`, `ఎక్స్ ట్రా ఆర్డిన‌ర్ మ్యాన్` లాంటి సినిమాలు మాత్రం ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. కానీ ఈ ఏడాది మాత్రం `గుంటూరు కారం`తో పాటు పాన్ ఇండియాలోనే ఫేమ‌స్ అయింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `పుష్ప‌-2` `కిసిక్` అంటూ ఐటం పాట‌తో ఇండియాని ఊపేసింది.

ఒక్క పాట‌తో తెలుగ‌మ్మాయి స‌త్తా పాన్ ఇండియాలోనే చాటింది. `ఊ అంటావా` పాట‌తో స‌మంత‌కు ఎంత గుర్తింపు వ‌చ్చిందో? అంత‌కు మించిన గుర్తింపు లాంగ్ ర‌న్ లో శ్రీల‌ల‌కు ద‌క్కుతుంద‌నే అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే ఆ పాట‌కు సోష‌ల్ మీడియాలో రీల్స్ సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఇదే నెల‌లో శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తున్న‌ `రాబిన్ హుడ్` రిలీజ్ అవుతుంది. ఇందులో యూత్ స్టార్ నితిన్ కి జోడీగా న‌టించింది.

వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. ఇంత వ‌ర‌కూ అత‌డికి ఫెయిల్యూర్ లేదు. దీంతో ఈ సినిమాపై అంచ‌నాల‌తో పాటు..సక్సెస్ అవుతుంద‌నే న‌మ్మకం అంద‌రిలో ఉంది. విజ‌యం సాధిస్తే శ్రీలీల‌కు ఈ సినిమా ఓ బోన‌స్ లాంటింది. ఈ ఏడాది హీరోయిన్ గా పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌పోయినా శ్రీలీల క్రేజ్ మాత్రం ఎక్క‌డా కింగ‌లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతూనే ఉంది. కొత్త ఏడాది 2025 లో `మాస్ జాత‌ర‌`, `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` చిత్రాల‌తో అల‌రించ‌నుంది.