Begin typing your search above and press return to search.

శ్రీలీల.. ఎర్ర చీరలో అన్‌స్టాపబుల్ లుక్

అలాగే ఆమె క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమైన రాబిన్‌హుడ్ చిత్రంలో కూడా నటిస్తోంది.

By:  Tupaki Desk   |   26 Nov 2024 11:51 AM GMT
శ్రీలీల.. ఎర్ర చీరలో అన్‌స్టాపబుల్ లుక్
X

టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న యాక్ట్రెస్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా పుష్ప 2లో అల్లు అర్జున్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో సందడి చేయబోతోందనే వార్త ఇప్పటికే ప్రేక్షకులను ఉత్సాహపరచుతోంది. అలాగే ఆమె క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమైన రాబిన్‌హుడ్ చిత్రంలో కూడా నటిస్తోంది.

ఇంత బిజీ షెడ్యూల్ మధ్య, శ్రీలీల "ఆహా" ప్రఖ్యాత టాక్‌షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేకు హాజరై అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఎపిసోడ్‌లో ఆమెతో పాటు నవీన్ పోలిశెట్టి కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. అయితే, షూటింగ్ సెట్స్‌పైనే శ్రీలీల తన గ్లామర్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎర్ర చీరలో చోకర్, పొడవాటి చెవిపోగులు, బ్రేస్‌లెట్స్‌తో అలంకరించుకొని, సంప్రదాయ గ్లామర్‌ను మిళితం చేస్తూ స్టైలిష్ లుక్‌లో మెరిసింది. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నందమూరి బాలకృష్ణతో శ్రీలీల ఇటీవల భగవంత్ కేసరి చిత్రంలో స్క్రీన్‌ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి అమ్మడికి మరింత బూస్ట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా అంశాలు తలపతి విజయ్ 69వ ప్రాజెక్టుకు ప్రేరణ కలిగిస్తున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇక శ్రీలీల కెరీర్ ప్రస్తుతం మంచి ఊపుమీద కొనసాగుతోంది.

తన గ్లామర్‌తో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్‌షో ఎపిసోడ్ విడుదలకు ముందు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఎపిసోడ్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, శ్రీలీల అందం, అభినయంపై మరింత ఫిదా అవుతారని అనుకోవచ్చు. ఇక శ్రీలీల త్వరలో పుష్ప 2లో స్పెషల్ సాంగ్‌తో అభిమానులను ఎంతగానో అలరించబోతోంది. మరి, రాబిన్‌హుడ్‌తో అమ్మడు ఎంతటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.