గుంటురు కారం కొత్త ట్విస్ట్.. శ్రీలీల ఒప్పుకుంటుందా?
'ఔట్ ఆఫ్ లవ్' అనే వెబ్‌సిరీస్‌లో మీనాక్షి చౌదరి నటనకు ఫిదా అయినా మేకర్స్.. శ్రీలీల ప్లేస్‌లో మీనాక్షి తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 7 Sep 2023 2:30 AM GMTసూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్.. ఎన్నో కష్టాలు, సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే దిశగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పుడీ మళ్లీ ఈ సినిమా విషయంలో ఓ కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
కథానాయికల విషయంలో ఫ్యాన్స్ షాకయ్యేలా ఓ సరికొత్త వార్త తెరపైకి వచ్చింది. మొదట ఈ సినిమాలో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ఎంపికైన సంగతి తెలిసిందే. రెండో హీరోయిన్గా యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ సడెన్‌గా పూజా హెగ్డే తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా సస్పెన్స్‌తో గ్యాప్ ఇచ్చి.. శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశారు. హిట్ ఫేమ్ మీనాక్షి చౌదరిని రెండో హీరోయిన్గా ఎంపిక చేశారు.
హమ్మయ్య హీరోయిన్ టెన్షన్ తప్పింది అనుకుంటే ఆ తర్వాత పలు సమ్యస్యలతో సినిమా ఆగుతూ వచ్చి రీసెంట్గా షురూ అయింది. కానీ ఇప్పుడు మళ్లీ హీరోయిన్స్ విషయంలో మూవీటీమ్ ఓ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఫిల్మ్‌మేకర్స్ శ్రీలీల ప్లేస్‌లోకి మీనాక్షి చౌదరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.
'ఔట్ ఆఫ్ లవ్' అనే వెబ్‌సిరీస్‌లో మీనాక్షి చౌదరి నటనకు ఫిదా అయినా మేకర్స్.. శ్రీలీల ప్లేస్‌లో మీనాక్షి తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ధమాకా బ్యూటీ రెండో హీరోయిన్గా నటించేందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అసలే ఆమె ఈ మధ్య మెయిన్ లీడ్‌లో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఒప్పుకుంటుందో లేదో.
ఒకవేళ శ్రీలీల ఈ సెకండ్ హీరోయిన్గా నటించేందుకు ఒప్పుకుంటే ఓకే.. లేదంటే నో చెప్పి తప్పుకునే పరిస్థితి ఏర్పడితే... మేకర్స్ కొత్త టెన్సషన్ మళ్లీ మొదలైనట్టే. చూడాలి మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఏం జరుగుతుందో అనేది.