Begin typing your search above and press return to search.

వీడియో : భ‌ర‌త‌నాట్యంతోను మ‌డ‌తెట్టేసిన శ్రీలీల‌

అంద‌మైన చ‌క్రాల్లాంటి క‌ళ్ల‌ను తిప్పుతూ.. ల‌య‌బ‌ద్ధంగా శ‌రీరంలో ప్ర‌తి భాగాన్ని అద్భుత‌ భంగిమ‌లోకి తీసుకుని వ‌స్తూ.. శ్రీ‌లీల చేస్తున్న ఈ నాట్యం క‌ళ్లు తిప్పుకోనివ్వ‌డం లేదు.

By:  Tupaki Desk   |   2 March 2024 8:11 PM GMT
వీడియో : భ‌ర‌త‌నాట్యంతోను మ‌డ‌తెట్టేసిన శ్రీలీల‌
X

'కుర్చీ మడతపెట్టి..' అంటూ శ్రీ‌లీల చేసిన హంగామాను యువ‌త‌రం అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఇలాంటి మాస్ పాట‌కు దుమ్ము దులిపేయ‌డం లీల‌కు రొటీన్ మ్యాట‌రే కానీ, ఇదిగో ఇప్పుడిలా భ‌ర‌త‌నాట్యంతోను మ‌డ‌తెట్టేయ‌డ‌మే అంద‌రికీ బిగ్ స‌ర్ ప్రైజ్ గా మారింది. శ్రీ‌లీల‌లో ఎవ‌రికీ తెలియ‌ని ఈ కొత్త కోణం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఏదో సినిమాటిక్ లిబ‌ర్టీతో డ్యాన్సులు చేస్తుందిలే అనుకున్న‌వారికి త‌న‌లోని ఈ క్లాసిక్ యాంగిల్ నిజంగా షాకిచ్చేదే. శ్రీ‌లీల‌ ఇటీవల సమతా కుంభ్ 2024లో అద్భుతమైన శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో అహూతులను ఆకట్టుకుంది.

అంద‌మైన చ‌క్రాల్లాంటి క‌ళ్ల‌ను తిప్పుతూ.. ల‌య‌బ‌ద్ధంగా శ‌రీరంలో ప్ర‌తి భాగాన్ని అద్భుత‌ భంగిమ‌లోకి తీసుకుని వ‌స్తూ.. శ్రీ‌లీల చేస్తున్న ఈ నాట్యం క‌ళ్లు తిప్పుకోనివ్వ‌డం లేదు. క‌ళ్ల‌తోనే కోటి భావాల్ని ప‌లికిస్తోంది. సంప్రదాయ పట్టుచీర ధరించి త‌న మోములో ద‌య‌, గాంభీర్యం ఒలికిస్తూ అబ్బుర‌ప‌రిచింది.

ఆ ముఖాభిన‌యం.. పాదం క‌ద‌లిక‌లు స‌హా ప్ర‌తిదీ ఎంతో సంక్లిష్ఠంగా ఉండే భ‌ర‌త‌నాట్యాన్ని అవ‌లీల‌గా చేస్తూ శ్రీ‌లీల నిజంగా త‌న అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సాధారణంగా భరతనాట్య నృత్యకారులు ధరించే సంప్రదాయ శిరస్త్రాణం. శ్రీలీల శాస్త్రీయ నృత్యం చూప‌రుల‌ను క‌ట్టి ప‌డేసే అద్భుత‌ దృశ్యం అన‌డంలో సందేహం లేదు.

శ్రీలీల ఇటీవ‌లే మ‌హేష్ స‌ర‌స‌న త్రివిక్ర‌మ్ 'గుంటూరు కారం'లో నటించింది. త‌దుప‌రి పవన్ కళ్యాణ్ స‌ర‌స‌న 'ఉస్తాద్ భగత్ సింగ్'లో అవ‌కాశం అందుకుంది. ఎన్నిక‌ల అనంత‌రం ప‌వ‌న్ క‌ల్యాణ్ దీనిని ప్రారంభించే అవ‌కాశం ఉంది. త‌దుప‌రి శ్రీలీల ఇత‌ర ప్రాజెక్టులేమిట‌న్న‌ది తెలియాల్సి ఉంది.