డాక్టర్ కూతురు డాక్టర్ అయినా అన్ కంట్రోల్డ్
అన్నీ వాళ్లే అయిపోతారు. శ్రీలీల విషయంలో కూడా అదే జరిగింది. చిన్నప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో ఇంట్లో జాగ్రత్తలు ఎక్కువ అట.
By: Tupaki Desk | 6 Feb 2024 2:30 PM GMTటాలీవుడ్ లో శ్రీలీల కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. అమ్మడు పట్టిందల్లా బంగార మే అన్నట్లు దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయిన హీరోయిన్ ఎవ రంటే? శ్రీలీల పేరే వినిపిస్తుంది. హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంటనే కీలక పాత్రలకు సైతం సై అం టోంది. నటిగా పరిపూర్ణత దక్కాలంటే? అన్నిరకాల పాత్రలు పోషించినప్పుడే అది సాద్యమవుతుందని ముందుకు సాగుతుంది.
ఇటీవల రిలీజ్ అయిన 'గుంటూరు కారం'తో మరో విజయం ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీలీల కూడా డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన సంగతి తెలిసిందే. అమ్మడు డాక్టర్ ఫ్యామిలీ నుంచి టాలీవు డ్ కి వచ్చింది. వాళ్ల మదర్ పేరున్న గైనకాలజిస్ట్. బెంగుళూరులో డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు. దీంతో శ్రీలీలని కూడా మామ్ డాక్టర్ గా చూడాలని భావించి డాక్టర్ చదివించింది. ఇక డాక్టర్స్ ఫ్యామిలీ అయితే వాళ్లకు డైటీషన్లు అవసరం లేదు.
అన్నీ వాళ్లే అయిపోతారు. శ్రీలీల విషయంలో కూడా అదే జరిగింది. చిన్నప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో ఇంట్లో జాగ్రత్తలు ఎక్కువ అట. చిన్నప్పుడు చెంచాల కొద్ది నెయ్యి వేసి పప్పన్నం తినిపించే వారుట. కానీ శ్రీలీలకి మాత్రం బేకరి ఫెడ్ తినడం ఇష్టమ. దీంతో మామ్ కి తెలియకుండా బెంగుళూరు బ్యాకరీలు అన్నింటిని చుట్టేసిందిట. ఇప్పటికీ ఆ అలవాటు అలాగే కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
బ్యాకరీకి వెళ్తే టేస్ట్ చేయని ఐటమ్ అంటూ ఏదీ ఉండదట. అందులోనూ మల్బరీ క్రీమ్ తో తయారు చేసిన షాధూమ్ మలై అంటే మరింత ఇష్టమట. ఫోన్ లో పుడ్ ఆర్డర్ ఐటమ్స్ చూస్తే ఈ ఐటమ్ తప్పకుండా ఉంటుందిట. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత బిర్యానీ కూడా బాగానే అలవాటు అయిందంటోంది. ఇక్కడ వచ్చిన టేస్ట్ ఇండియాలో ఇంకెక్కాడా? రాదు అనేసింది.