Begin typing your search above and press return to search.

ప‌ర‌వ‌శంలో మునిగిపోయిన శ్రీ‌లీల‌

తాజాగా శ్రీ‌లీల రెడ్ క‌ల‌ర్ మిడ్డీ ధ‌రించి వినువీధుల్లో విహ‌రిస్తున్న ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   3 Jun 2024 4:01 AM GMT
ప‌ర‌వ‌శంలో మునిగిపోయిన శ్రీ‌లీల‌
X

టాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ శ్రీలీల పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఈ బ్యూటీ అవ‌కాశాలు అందుకుంటోంది. రొటీన్ గా మ‌ల‌యాళీ భామ‌ల డామినేష‌న్ ఉండే తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు శ్రీ‌లీల లాంటి ప్ర‌తిభావంతురాలైన తెలుగ‌మ్మాయి ఎదురీద‌డం నెగ్గుకు రావ‌డం అన్న‌ది పూర్తిగా కొత్త అని చెప్పాలి.

మ‌హేష్ తో గుంటూరు కారం ఫ్లాపైనా కానీ, శ్రీ‌లీల‌కు బ్యాడ్ నేమ్ రాలేదు. లైవ్ వైర్‌లా డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టింద‌ని ప్ర‌శంస‌లు కురిసాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న గోపీచంద్ మల్లినేని ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌లీల క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.

అంతేకాదు దీనికోసం ఏకంగా 2 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది ర‌వితేజ‌తోనే నటించిన ధ‌మాకా పారితోషికం కంటే నాలుగు రెట్లు ఎక్కువ అన్న చ‌ర్చా సాగుతోంఇ. ఏది ఏమైనా కానీ మ‌హేష్ లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న న‌టించిన శ్రీలీల ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ స‌ర‌స‌న న‌టించేస్తోంది. త‌దుప‌రి ర‌వితేజ‌తో సినిమా ఆఫ‌ర్ అన‌గానే పారితోషికం పెంచేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం శ్రీ‌లీల త‌మిళంలోను స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. అక్క‌డ ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో మంత‌నాలు సాగిస్తున్నార‌ని కూడా తెలుస్తోంది. త‌ళా అజిత్ కుమార్, కార్తీ, సూర్య లాంటి పెద్ద స్టార్లతో కలిసి పనిచేయడానికి ప్లాన్ చేస్తోంద‌ని పుకార్ల షికార్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ‌ ఒక పెద్ద స్టార్ తో సినిమాకి క‌మిటైంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

మ‌రోవైపు శ్రీ‌లీల వ‌రుస ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా శ్రీ‌లీల రెడ్ క‌ల‌ర్ మిడ్డీ ధ‌రించి వినువీధుల్లో విహ‌రిస్తున్న ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. ఆకాశంలో విహ‌రించ‌క‌పోయినా కానీ ఆకాశం ఎత్తు ఉన్నాన‌ని స‌ర‌దాగా ఫ‌న్నీగా ఇదిగో ఇలా ఫోటో దిగి దానిని ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ అల్ల‌రి పిల్ల‌.

ఇదిగో నేను పారవశ్యం లో ఉన్నా! అంటూ గులాబీ ఈమోజీని షేర్ చేసింది శ్రీ‌లీల‌. త‌న హావ‌భావాన్ని లేదా ఆనందాన్ని ఇలా వ్య‌క్తీక‌రించింది అన్న‌మాట‌. దీని అర్థం అటు త‌మిళంలో అగ్ర హీరో, ఇటు తెలుగు లో అగ్ర హీరో స‌ర‌స‌న ఒకేసారి క‌మిట‌య్యాన‌ని రెండు సినిమాల‌కు క‌లుపుకుని 4 కోట్లు (2+2) అందుకుంటోంద‌ని అభిమానులు విశ్లేషిస్తున్నారు.