Begin typing your search above and press return to search.

శ్రీలీల.. ఆ విషయంలో మారకపోతే అంతే?

ఈ సినిమాలన్నింటిలో శ్రీలీల సెలెక్ట్ చేసుకున్న పాత్రలతో పాటు నటన పరంగాను నిరాశపరిచింది.

By:  Tupaki Desk   |   17 Dec 2023 6:47 PM GMT
శ్రీలీల.. ఆ విషయంలో మారకపోతే అంతే?
X

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఈవెంట్స్, షోస్ అంటూ బయట ఎక్కువగా కనిపిస్తే వాళ్లని బిగ్ స్క్రీన్స్ పై చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పుడు శ్రీలీలా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ధమాకా సినిమాతో యూత్ ని తన అందం, అభినయంతో విపరీతంగా ఆకట్టుకొని యంగ్ సెన్సేషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల ఈ మధ్య వరుస సినిమాలతో ఆడియన్స్ నిరాశ పరుస్తూ వస్తోంది. రీసెంట్ టైమ్స్ లో శ్రీ లీల నటించిన స్కంద, ఆది కేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలన్నింటిలో శ్రీలీల సెలెక్ట్ చేసుకున్న పాత్రలతో పాటు నటన పరంగాను నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఓ మై బేబీ సాంగ్ పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది.

పాటనిడివి తక్కువగా ఉండడం, లిరిక్స్, తమన్ కంపోజిషన్ ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ మూవీ టీం పై ఫైర్ అయ్యారు. ఈ విషయం పక్కన పెడితే శ్రీలీల ఈమధ్య బిగ్ స్క్రీన్ పైనే కాకుండా టీవీ స్క్రీన్ పై కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరుస టీవీ షోలో శ్రీలీల కనిపించడంతో ఆడియన్స్ కి అది కాస్తా రెగ్యులర్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ హీరోయిన్ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్లో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7 లో మూడుసార్లు కనిపించిన శ్రీలీల ఫైనల్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ పై సందడి చేస్తే అది నాలుగో సారి అవుతుంది. బిగ్ బాస్ మాత్రమే కాదు ఇతర టీవీ షోల లో కూడా గ్యాప్ ఇవ్వకుండా కనిపిస్తోంది.

దీంతో ఆమెను చూసి ఆడియన్స్ విసిగిపోయినట్లు కనిపిస్తోంది. ఇలా రెగ్యులర్ గా స్మాల్ స్క్రీన్ లో కనిపించడం వల్ల ఆమెని బిగ్ స్క్రీన్ పై చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో తగ్గిపోతుంది. శ్రీలీల ఇప్పటికైనా తన స్టార్ డం ను తిరిగి పొందాలంటే ఇలాంటి విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మరి ఈ విషయంలో శ్రీలీల ఏం చేస్తుందో చూడాలి