Begin typing your search above and press return to search.

శ్రీ లీల రిలేషన్‌ లో ఉంది : రామ్‌

శ్రీలీల బ్రేకప్‌ జరగలేదు అనగానే రామ్‌ కల్పించుకుని.. ఔను శ్రీలీలకి బ్రేకప్ అవ్వలేదు. ఆమె ఇంకా రిలేషన్ లో ఉంది. అందుకే బ్రేకప్ కాలేదు అన్నాడు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:26 AM GMT
శ్రీ లీల రిలేషన్‌ లో ఉంది : రామ్‌
X

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద చిత్రం విడుదలకు సిద్ధం అయింది. మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్కంద సినిమా ప్రమోషన్‌ లో భాగంగా రామ్‌ మరియు హీరోయిన్‌ శ్రీలీల ఇద్దరూ కూడా గత కొన్ని రోజులుగా మీడియా ముందు సందడి చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు కూడా పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. యాంకర్ మీ ఇద్దరిలో ఎవరికి అయినా బ్రేకప్‌ అయిందా అన్నట్లుగా ప్రశ్నించగా.. రామ్ వెంటనే ఔను అనే ప్లకార్డ్‌ ను చూపించాడు. నాకు బ్రేకప్‌ అయిందని రామ్ బాహాటంగానే ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే శ్రీలీల మాత్రం తనకు బ్రేకప్‌ ఏమీ అవ్వలేదు అన్నట్లుగా నో ప్లకార్డ్‌ చూపించింది.

శ్రీలీల బ్రేకప్‌ జరగలేదు అనగానే రామ్‌ కల్పించుకుని.. ఔను శ్రీలీలకి బ్రేకప్ అవ్వలేదు. ఆమె ఇంకా రిలేషన్ లో ఉంది. అందుకే బ్రేకప్ కాలేదు అన్నాడు. వెంటనే శ్రీలీల స్పందిస్తూ నేను రిలేషన్‌ లో లేను. అలాగే బ్రేకప్‌ కూడా కాలేదు. రిలేషన్‌ లో ఉండటం కోసం వెయిట్‌ చేస్తున్నాను. తప్పకుండా మంచి వ్యక్తి తారసపడితే రిలేషన్‌ షిప్ మొదలు పెడతాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

రామ్‌ మరియు శ్రీలీల లు తమ బ్రేకప్ ల గురించి బాహాటంగా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మధ్య కాలంలో శ్రీలీల ఉన్న బిజీకి కనీసం తినేందుకు కూడా సమయం లేకుండా ఉండి ఉంటుంది. అలాంటి శ్రీలీల రిలేషన్ లో ఉండక పోవచ్చు అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం చేతిలో పది సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల స్కంద సినిమా తో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుసగా మంచి సక్సెస్ లను దక్కించుకుంటున్న శ్రీలీలకు స్కంద సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.