శ్రీలీలని నటిగా గుర్తించడం లేదా?
డాన్సు విషయంలో అమ్మడి ఎనర్జీని మాత్రం ఏ హీరో కూడా మ్యాచ్ చేయలేడు అనడంలో డౌట్ లేదు.
By: Tupaki Desk | 9 March 2024 2:30 PM GMTశ్రీలీల మూడేళ్ల కెరీర్ లోనే ఏనిమిది తొమ్మిది సినిమాలు చేసేసింది. `పెళ్లి సందడి` అనే చిన్న సినిమాతో పరిచయమైన అమ్మడు ఇన్ని సినిమాలు చేయడం అంటే ఆషామాషీ కాదు. మరి వీటిలో శ్రీలీలకి గ్రేట్ పెర్పార్మర్ గా పేరు తెచ్చిన సినిమా ఏదైనా ఉందా? అంటే చెప్పడం కష్టం. అలా అనడం కంటే శ్రీలీల గొప్ప డాన్సర్ గా సక్సెస్ అయింది అనడంలో మాత్రం ఎలాంటి సందహం లేదు. డాన్సు విషయంలో అమ్మడి ఎనర్జీని మాత్రం ఏ హీరో కూడా మ్యాచ్ చేయలేడు అనడంలో డౌట్ లేదు.
హీరోలందరీ తాట ఊడిపోయేలా డాన్స్ చేస్తుందని మహేష్ పొగిడేసాడు. ఆ విషయంలో శ్రీలీలకు పోటీగా సాయి పల్లవిని మాత్రమే చెప్పాలి. ప్రస్తుతం అమ్మడి చేతిలో `ఉస్తాద్ భగత్ సింగ్` తో పాటు విజయ్ దేరకొండ సినిమా ఒకటి చేతిలో ఉంది. ఈ రెండు తప్ప కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. దీంతో శ్రీలీల ఎందుకు వెనుకబడుతోంది? అన్న వాదన తెరపైకి వస్తోన్న నేపథ్యంలో శ్రీలీల యాక్టింగ్స్ స్కిల్స్ గురించి చర్చకొస్తుంది.
ఇటీవలే `పుష్ప-2` లో ఐటమ్ సాంగ్ కోసం అమ్మడిని అప్రోచ్ అయితే రిజెక్ట్ చేసిందనే ప్రచారం సాగింది. పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేయడం వెనుక కారణం ఏంటి? అని ఆరాతీయగా తాను ఫోకస్ అవ్వాలనుకుంటుంది నటిగా తప్ప ఐటం భామగా కాదనే విషయంలో వెలుగులోకి వస్తోంది. ఆ కారణంగాతోనే భారీగా తాను ఊహించనంత పారితోషికం ఇస్తానన్న కమిట్ అవ్వలేదు అన్న కారణం వైలర్ అవుతోంది.
అలాగే మరో భారీ ఆఫర్ కూడా తిరస్కరించిందనే ప్రచారం సాగింది. ఇంకా కొత్త సినిమాల విషయంలో తన పాత్రకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తుందని వినిపిస్తుంది. అయితే శ్రీలీలలో ఈ మార్పు వెనుక బలమైన కారణమే ఉందనిపిస్తుంది. ఇండస్ట్రీ ఆమెని నటిగా గుర్తించకపోవడంతోనే పాత్రల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందని...ఐటం పాటల్ని రిజెక్ట్ చేయడానికి కారణం కూడా అదే అంటున్నారు.