Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : స్వర్గం నుంచి దిగి వచ్చిన రాజకుమారి

ధమాకా తర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

By:  Tupaki Desk   |   31 July 2024 3:15 AM GMT
పిక్‌ టాక్‌ : స్వర్గం నుంచి దిగి వచ్చిన రాజకుమారి
X

పెళ్లి సందడి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు మొదటి సినిమాతో నిరాశ పరిచిన కూడా ధమాకా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ధమాకా తర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేయడం మొదలు పెట్టింది.


శ్రీలీల హీరోయిన్‌ గా ఒకానొక సమయంలో ఏకంగా పది సినిమాలు ఏక కాలంలో చేసిన విషయం తెల్సిందే. బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు నిరాశ పరిచినా కూడా శ్రీలీల ధమాకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం కూడా ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.


ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉన్నాయి. తాజాగా మరోసారి శ్రీలీల ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ ఫోటోలను షేర్‌ చేసిన ఫ్యాన్స్ మా శ్రీలీల బంగారం అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తూ తెగ వైరల్‌ చేస్తున్నారు.


స్వర్గం నుంచి దిగి వచ్చిన రాజకుమారి మా శ్రీలీల అంటూ ఈ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగానే శ్రీలీల ఈ ఔట్‌ ఫిట్ లో చాలా అందంగా ఉందని, స్వర్గం నుంచి దిగి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తుంది కనుకే ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.