Begin typing your search above and press return to search.

మహేష్ బుగ్గపై శ్రీలీల పెదవుల దాడి

కానీ అక్కడ వాతావరణం అనుకూలించడం లేదు అని మళ్ళీ వెంటనే రామోజీ ఫిలిం సిటీ లో ఒక ప్రత్యేకమైన సెట్ కూడా వేశారు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 12:49 PM GMT
మహేష్ బుగ్గపై శ్రీలీల పెదవుల దాడి
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక షూటింగ్ కు అసలు బ్రేక్ లేకుండా చిత్ర యూనిట్ చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. ఒకచోట పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా వెంటనే లొకేషన్స్ కూడా మార్చేస్తున్నాడు.


దర్శకుడు త్రివిక్రమ్ సెకండ్ సాంగ్ కోసం కేరళలో షూటింగ్ చేయాలని అనుకున్నారు. కానీ అక్కడ వాతావరణం అనుకూలించడం లేదు అని మళ్ళీ వెంటనే రామోజీ ఫిలిం సిటీ లో ఒక ప్రత్యేకమైన సెట్ కూడా వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి డేట్ ను మిస్ చేసుకోవద్దని నిర్మాతలు కూడా గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే మొత్తానికి ఈ సినిమా సెకండ్ సాంగ్ 'ఓ మై బేబీ'కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశారు.

ఇక విడుదల చేసిన ప్రత్యేకమైన పోస్టర్ లో మహేష్ బాబు బుగ్గపై శ్రీల ముద్దు పెట్టుకున్న స్టిల్ చాలా హైలెట్గా నిలిచింది. త్రివిక్రమ్ మార్క్ కు తగ్గట్టుగా ఉన్న ఈ పోస్టర్ లో మహేష్ బాబు గొడుగు పట్టుకుని ఒక బెంచీ పై కూర్చుని ఉండగా శ్రీలీల ఎంతో ఇష్టంగా అతన్ని ముద్దు పెట్టుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇందులో త్రివిక్రమ్ స్టైల్ రొమాంటిక్ సీన్స్ గట్టిగానే ఉండబోతున్నట్లు కూడా అనిపిస్తూ ఉంది.

మహేష్ బాబును త్రివిక్రమ్ ఎంత స్మార్ట్ గా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక థమన్ ఇచ్చిన మొదటి పాట పరవాలేదు అనిపించింది. రెండో పాట ఈనెల 13వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక అంతకంటే ముందు డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం 4:05కి ఒక ప్రోమో కూడా విడుదల చేయబోతున్నట్లు ఆ పోస్టర్లోనే క్లారిటీ ఇచ్చేశారు.

మొత్తానికి ఓ మై బేబీ పాటపై పోస్టర్ తోనే అంచనాలు పెంచేశారు. మరి లిరికల్ వీడియోలో ఏమైనా సన్నివేశాలు హైలైట్ అవుతాయో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో శ్రీలీల తో పాటు మీనాక్షి చౌదరి కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. స్టార్ నటీనటులు ఈ సినిమాలో గట్టిగానే ఉన్నారు. ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ కూడా ఇందులో కనిపించబోతున్నారు. మరి సంక్రాంతి బరిలో పెద్ద సినిమాగా వస్తున్న గుంటూరు కారం ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.