శ్రీలీలని క్షమించని తల్లి..అంత పాపం ఏం చేసిందంటే ?
శ్రీలీల తల్లి స్వర్ణలత బెంగుళూరులో ఫేమస్ గైనకాలజిస్ట్ అట. ఆమె కారణంగానే శ్రీలీల డాక్టర్ అవ్వాలనుకుందిట.
By: Tupaki Desk | 28 Aug 2023 8:12 AM GMTయువ నాయిక శ్రీలీల టాలీవుడ్ లో ఎలా వెలిగిపోతుందో తెలిసిందే. అమ్మడితో నటించడానికి హీరోలే పోటీ పడుతున్నారు. వచ్చిన అవకాశాల్ని శ్రీలీల తెలివిగా సద్వినయోగం చేసుకుంటుంది. తనదైన చలాకీత నంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇలా నటిగా కంటే రష్మిక మందన్నా లో కొన్ని అదనపు లక్షణాలు అవకాశాలకు దారి తీస్తున్నాయి. ఇక శ్రీలీల మంచి డాన్సర్. మంచి ఎనర్జీతో పెర్పార్మెన్స్ చేస్తుంది.
డాన్సు విషయంలో సాయి పల్లవి తర్వాత అమ్మడికి మంచి గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు. టాలీవుడ్ మును ముందు ఇంకా మంచి భవిష్యత్ ఉందని చెప్పొచ్చు. అయితే ఆమె ఇంత గొప్ప డాన్సర్ అవ్వడం వెనుక ఆమె తల్లి స్వర్ణలత ఉన్నట్లు తెలుస్తుంది.
చిన్నప్పుడు అమ్మ ఒత్తిడి వల్లే భరత నాట్యం నేర్చుకుందిట. చదువుతో పాటు భరత నాట్యం కూడా తన జీవితంలో భాగమైందిట. స్కూల్లో ఏ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన శ్రీలీల ముందుగా పేరిచ్చేదట.
తొలి పెర్పార్మెన్స్ ఆమెదే అయ్యేదట. ఇక ఆమె డాన్స్ ప్రాక్టీస్ ఏ రేంజ్ లో ఉండేదంటే? కాళ్లకు బొబ్బి కట్టినా డాన్స్ ఆపేది కాదుట. కాదు కాదు వాళ్లమ్మ ఆపితే ఒప్పుకునేది కాదట. చాలు అమ్మ..పాదాలు మండిపోతున్నాయని చెప్పినా వినేవారు కాదుట. బొబ్బలు కట్టినా డాన్సు చేయాల్సిందేననని కఠినంగా వ్యవహరించేవారుట. అలా డాన్సు మీద కాస్త చిరాకు పెరిగినప్పటికీ కాలక్రమంలో బాగా అలవాటైందని తె లిపింది. పాదాలు ఇలా బొబ్బి కట్టడం వల్ల రాటు దేల్తాయి. పాదాలపై ఒత్తిడి పడినా డాన్సు చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదనే ఆ వయసులో వాళ్లమ్మ అలా చేయించేవారుట.
శ్రీలీల తల్లి స్వర్ణలత బెంగుళూరులో ఫేమస్ గైనకాలజిస్ట్ అట. ఆమె కారణంగానే శ్రీలీల డాక్టర్ అవ్వాలనుకుందిట. చిన్న నాటి నుంచి ఇంట్లో డాక్టర్ వాతావరణ..సెమినార్లు వెళ్లడం వంటివి ఆ వృత్తి వైపు ప్రేరేపించినట్లు తెలిపింది.
అయితే సినిమాలంటే స్వర్ణలతకి కూడా బాగా ఇష్టమట. ఆ కారణంగానే కుమార్తె ముఖానికి మేకప్ వేయించినట్లు తెలుస్తోంది. అలాగే యశ్ భార్య రాధికకు ...స్వర్ణలత పురుడు పోసారుట. అలా ఆ కుటుంబంతో మంచి పరిచయం ఏర్పడిందిట.