శ్రీలీల జస్ట్ ఛిల్ అవుతుందా?
నెట్టింట ఇప్పటికే కొత్త ఫోటో షూట్లతో అదరగొడుతుంది. వాటి ద్వారానైనా కాస్టింగ్ ఏజెన్సీస్ నుంచి పిలుపు వస్తుం దని ఆ రకమైన ప్రయత్నం చేస్తుంది.
By: Tupaki Desk | 8 Jun 2024 11:00 PM IST`గుంటూరు కారం` తర్వాత శ్రీలీల ఖాళీ అయిపోయింది. చేతిలో సినిమాలు లేవు. కమిట్ అయిన `ఉస్తాద్ భగత్ సింగ్` ఉందంటే? అది మొదలవ్వాలంటే పవన్ కళ్యాణ్ ముందుకు రావాలి. అది ఇప్పట్లో జరిగేది కాదు. `ఓజీ`, `హరి హర వీరమల్లు` పూర్తి చేసేవరకూ పీకే `భగత్ సింగ్` వైపు చూసే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు శ్రీలీల ఏం చేస్తున్నట్లు? టైమ్ ని ఎలా పాస్ చేస్తున్నట్లు? అంటే ఈగ్యాప్ లో అమ్మడు పుల్ చిల్ మోడ్ లోకి జారుకుంటుందని విశ్వసనీయ సమాచారం.
నెట్టింట ఇప్పటికే కొత్త ఫోటో షూట్లతో అదరగొడుతుంది. వాటి ద్వారానైనా కాస్టింగ్ ఏజెన్సీస్ నుంచి పిలుపు వస్తుం దని ఆ రకమైన ప్రయత్నం చేస్తుంది. పనిలో పనిగా వాటితో శ్రీలీల అభిమానులు ఖుషీ అవుతున్నారనుకోండి. ఇలా ఎంత కాలం ఫోటో షూట్లతో టైంపాస్ చేస్తుంది. అందుకే అమ్మడు కొన్ని నెలల పాటు పూర్తిగా రిలాక్స్ మోడ్ లోకి వెళ్లే ప్లాన్ చేసుకుంటుందిట. దీనిలో భాగంగా విమానం ఎక్కి విదేశాలు చెక్కేయాలని చూస్తుందిట. గతేడాది ఖాళీ లేకుండా పనిచేసింది.
వరుసగా ఏదో సినిమా షూటింగ్ తో బిజీ బిజీ గా గడిపింది. అలాగే డాక్టర్ కోర్స్ కోసం ఉన్న సమయాన్ని చదవాడినికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఆ ఏడాది ఎక్కడా విరామం లేకుండా ఉండాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు చేతిలో కావాల్సినంత సమయం ఉంది. ఎలాంటి టెన్షన్లు కూడా లేవు. ఎంచక్కా కొన్ని రోజుల పాటు వెకేషన్ కి వెళ్లి మళ్లీ ప్రెష్ మైండ్ తో తిరిగి రావొచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది.
అయితే ఇప్పటికే కోలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తల అజిత్ సినిమాకి సైన్ చేసిందని తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే అది ప్రారంభం అవ్వడానికి సమయం పడుతుంది. ఈ లోపు శ్రీలీల ఛిల్ మూవ్ మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది.