Begin typing your search above and press return to search.

శ్రీలీల.. అలా వయ్యారాలు తిప్పేస్తూ..

శ్రీలీల, తన గ్లామర్ తోనే కాకుండా టాలెంట్ తో కూడా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది

By:  Tupaki Desk   |   19 Jun 2024 3:17 AM GMT
శ్రీలీల.. అలా వయ్యారాలు తిప్పేస్తూ..
X

శ్రీలీల, తన గ్లామర్ తోనే కాకుండా టాలెంట్ తో కూడా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆమె 'పెళ్లి సందD' సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన విధానం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక వచ్చి రాగానే, ఆ తర్వాత రవితేజ తో కలిసి చేసిన 'ధమాకా' సినిమాతో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల హిట్ కొట్టడం విశేషం. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ శ్రీలీలను టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మార్చింది.

అయితే, ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించినంత విజయాన్ని అందించకపోవడంతో ఆమె కెరీర్ లో కొన్ని ఆటుపోట్లు ఎదురయ్యాయి. 2023లో శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే మంచి హిట్ టాక్ అందుకోగా, మిగతా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం' కూడా మిక్స్‌డ్ టాక్ తోనే సరిపెట్టుకుంది.

ఇక విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోవడం, అలాగే మరో మీడియం రేంజ్ నుంచి మిస్సవ్వడం వంటి పరిణామాలు ఆమెకు కొంత నిరాశ కలిగించాయి. ఈ పరిణామాల మధ్య, శ్రీలీల కొంత సైలెంట్ గా ఉంటూ, కెరీర్ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కొత్త స్క్రిప్ట్ ల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది.

అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ లుక్స్ తో మళ్ళీ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసిన ఫ్యాన్స్ స్టన్ అవ్వాల్సిందే. బ్లాక్ కలర్ స్కట్ లో వయ్యారంగా ఇచ్చిన స్టిల్స్ తో ఫ్యాన్స్ ని మాయ చేసింది. వాష్ రూమ్ లో అమ్మడు బుంగమూతితో కవ్విచింది. ఒక్కో ఫొటోలో ఒక్కో స్టిల్ తో మ్యాజిక్ చేసేసింది. అమ్మడు ఎలా కనిపించినా అందంగా ఉంటుంది అంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇటీవలి వార్తల ప్రకారం, శ్రీలీలకు ఓ పెద్ద ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు జోడీగా శ్రీలీల నటించే అవకాశం ఉందట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ఆమెను సంప్రదించగా, కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.